మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం క్యాపిలిస్టులకు మాత్రమే పనికొచ్చే పనులు చేస్తోందని, వారికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటోందని అంటున్నారు. అయితే, గతంలో ఒక్కో బడ్జెట్ లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఉపయోగాలను కల్పించుకుంటూ వస్తున్నారు.  ఫిబ్రవరి 1 తేదీన కేంద్రం కొత్త బడ్జెట్ ను ఏర్పాటు చేయబోతున్నది.  ఈ బడ్జెట్ ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది.  ఎలా బడ్జెట్ ఉండబోతుంది అనే విషయాలు కొన్ని బయటకు వచ్చాయి.  


ఈ బడ్జెట్ లో ప్రైవేట్ ఉద్యోగులకు కొన్ని వరాలు ఇవ్వబోతున్నది.  అదేమంటే ఇప్పటి వరకు ప్రైవేట్ ఉద్యోగులకు కేవలం 1000 మాత్రమే పింఛన్ ను ఇస్తోంది.  అలా కాకుండా, ఇప్పుడు దానిని 1000 నుంచి రూ. 6000 కు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  ఈ నిర్ణయాన్ని బట్టి నెలకు రూ. 6000 చొప్పున పింఛన్ ఇచ్చేందుకు నిర్మలా బడ్జెట్ లో పెట్టినట్టు సమాచారం.  దీనిపై పూర్తి వివరాలు తెలియాలంటే ఫిబ్రవరి 1 వ తేదీ వరకు ఆగాల్సిందే. 


కేంద్ర ప్రభుత్వం దగ్గర దాదాపు రూ.3 లక్షల కోట్లు పెన్షన్‌ నిధులు ఉన్నాయి. అసంఘటిత కార్మికులతో పాటు వ్యాపారులకు సైతం ఇస్తున్నంత పెన్షనైనా ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఇవ్వట్లేదనే అసంతృప్తి... ఆ రంగ యూనియన్లలో కనిపిస్తోంది. అందువల్ల ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించింది. నెలకు మినిమం పెన్షన్ రూ.5,000 అదనంగా పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే... ఇదివరకటి కమ్యుటేషన్‌ పద్ధతిని మళ్లీ తేవాలని కూడా భావిస్తోంది 

 

కేవలం ప్రైవేట్ ఉద్యోగులకు మాత్రమే కాకుండా, మిగతా విషయాల్లో కూడా అనేక మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది.  రక్షణ రంగంతో పాటుగా, కార్మిక, రైతు, విద్యార్థులకు కూడా అనేక వరాలు ప్రకటించబోతున్నది. ఈ వరాలు ఎలా ఉంటాయి.  ఎలాంటి నిర్ణయాలు తీసుకోబుతోన్నారు అనే విషయాలను బడ్జెట్ లో ప్రవేశపెట్టబోతున్నారు.  అందరికి ఉపయోగపడే విధంగానే బడ్జెట్ ఉండబోతున్నట్టు సమాచారం.  మరి చూద్దాం ఈ బడ్జెట్ లో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నారో చూద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: