పురపోరు ముగిసింది, కానీ అసలు పోరు మొదలవనుంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్దులు ఈ రెండు రోజులు కూడా సరిగ్గా నిదురపోయారో లేదో కూడా తెలియదు. అంతగా ఉత్కఠం కలిగించాయి ఈ ఎన్నికలు. ఒక వైపు ఈ ఎన్నికల్లో నిలబడిన అభ్యర్ధులు లక్షలల్లో ఖర్చు చేయగా, మరో వైపు తెలంగాణ కారు పార్టీ బాస్ ఎలాగైనా గెలిచి తీరాలనే నియమాన్ని పెట్టాడు.

 

 

ఇలాంటి పరిస్దితుల్లో ఆయా నియోజక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులకు ఇదొక అగ్ని పరీక్షలా మారింది.. ఇకపోతే ఈ రోజు మున్సిపల్ ఎన్నికల ఫలితాల పక్రియ ఉదయం నుండే మొదలైంది. కాగా ఈ రోజు సాయంత్రానికల్లా 12,926 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 9 నగర పాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇక ఈ పోటీలో టీఆర్ఎస్ నుంచి 2,925 మంది అభ్యర్థులు, కాంగ్రెస్ నుంచి 2,619.. బీజేపీ నుంచి 2,321 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, టీడీపీ తరపున 347 మంది, ఏఐఎంఐఎం నుంచి 297 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు..

 

 

ఇక party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ నుంచి 180, సీపీఎం నుంచి 165, ఇతర పార్టీల వారు 284, స్వతంత్రులు 3,760 మంది పోటీ పడుతున్నారు. కాగా 134 కేంద్రాలు ఓట్ల లెక్కింపుకోసం  ఏర్పాటు చేయగా. అందులో 2,559 టేబుళ్లను సిద్దంగా ఉంచారు... ఇకపోతే ఒక్కో టేబుల్ దగ్గర ఓట్ల లెక్కింపునకు ముగ్గురు ఉంటారు. కాగా ఇందుకు గాను మొత్తం 10 వేల మంది సిబ్బందిని నియమించగా, వీరిలో 2,958 మంది సూపర్ వైజర్లు, 5,756 మంది అసిస్టెంట్లుగా ఉన్నారు..

 

 

ఇకపోతే మున్సిపల్ ఛైర్ పర్సన్లు, కార్పొరేషన్లకు మేయర్ల ఎంపిక ప్రక్రియ 27వ తేదీన ఉంటుందని, ఎస్ఈసీ నాగిరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరించారు. ఇందుకు సంబంధించి రాజకీయ పార్టీలు తమ విప్‌లను నియమించు కోవచ్చని పేర్కొన్నారు. ఇదే కాకుండా ఏ, బీ ఫారాల ద్వారా మేయర్, ఛైర్ పర్సన్లకు ప్రతిపాదించే వారి పేర్లను ఇవ్వాలని సూచించారు. ఇకపోతే ఈ నెల 26న ఉదయం 11 గంటల వరకూ ఫామ్-ఏ, 27న ఉదయం 10 గంటల లోపు ఫామ్-బీ ఇవ్వాల్సి ఉంటుందని, కాగా ఈ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక ఎన్నికల నిబంధన అమలులో భాగంగా ఈ రోజు అనగా 25వ తేదీ సాయంత్రం నుంచి ఈ నియమావళి అమలులో ఉంటుందని పేర్కొన్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: