తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగా.. ఈరోజు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి కౌంటింగ్ ప్రారంభించారు అధికారులు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఆయా పార్టీలు కూడా ఎంతో ఉత్కంఠగా ఫలితాలకోసం ఎదురు చూస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం వరకు ఏ పార్టీ ఘన విజయం సాధించిందో దాదాపు తేలిపోనుంది. ఇప్పటికే పలు మున్సిపాలిటీలలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాగా పలువురు అభ్యర్థుల భవితవ్యం తేలిపోయింది కూడా. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ లో  టిఆర్ఎస్ జోరు చూపిస్తోంది. 

 

 మొత్తంగా 80 నియోజకవర్గాల్లోని 120 మున్సిపాలిటీలు 9 కార్పోరేషన్లు కౌంటింగ్ ప్రారంభమైంది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులందరూ ప్రచార రంగంలో ఓటర్లను  ఎంతవరకు ఆకట్టుకున్నారు అనేది నేడు తేలిపోనుంది. ఇక మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పటిష్ట బందోబస్తు నడుమ అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఇకపోతే ఈ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ లో... రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు లో పోటీ చేసిన 12928 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. 

 

 

 ఇకపోతే ఈ నెల 27న చైర్మన్లు మేయర్ల  ఎంపిక జరుగుతుంది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు చైర్మన్లు మేయర్ ఎంపికలో ఎలాంటి హడావుడి సృష్టించకుండా.. ఎంపిక బాధ్యతను అధిష్టానం తీసుకుంది. సీల్డ్ కవర్ లో ఎమ్మెల్యేల ద్వారా చైర్మన్ లు, మేయర్లను   ఎంపిక చేసేందుకు అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. చైర్మన్లు మేయర్ లో ఎంపికలో స్థానిక లీడర్లు ఎవరికి.. సంబంధం లేకుండా ఉండేందుకు అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో స్థానిక లీడర్లు ఎక్కడా కూడా రచ్చ  చేసి ఎగరకుండా  ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే స్థానిక లీడర్ల తోకలు కట్  చేసినట్లు పలువురు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: