అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు. ప్రచార రంగంలో అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఈనెల 22న జరగగా... ఈరోజు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. భారీ బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు మోహరించారు. ఇక ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు పోలీసులు. పోలీసులు పటిష్ట బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు ప్రారంభించారు అధికారులు. 

 

 

 ఇక మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని పార్టీల అభ్యర్థుల భవితవ్యం ఏమిటో ఈ రోజు తేలిపోనుంది. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల లో కౌంటింగ్ ప్రారంభం కాగా కొన్ని చోట్ల అభ్యర్థుల భవితవ్యం తేలిపోయింది కూడా. కాగా ఈ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ లో టిఆర్ఎస్ పార్టీ ముందంజలో దూసుకుపోతుంది. ఇక పెద్దపల్లి జిల్లాలో కూడా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కాగా కౌంటింగ్ కేంద్రంలోకి రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ రావడంతో పలువురు నిరసన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా లోని కౌంటింగ్ కేంద్రం వద్ద విపక్ష నేతలు అందరూ ఆందోళనకు దిగారు. 

 

 

 రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ కౌంటింగ్ కేంద్రం లోకి రావడాన్ని  తప్పుబట్టిన విపక్ష పార్టీల కార్యకర్తలు.... ఆందోళన చేపట్టడంతో... రామగుండం ఎమ్మెల్యే చందర్ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేశారు. కాగా జిల్లాలోని 36 వార్డు లో ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ జరుగుతోంది. ఈ కౌంటింగ్ లో ఎలాంటి  ఫలితాలు వస్తాయో అని మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే  కాకుండా ఆయా పార్టీల కార్యకర్తలు అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయా పార్టీల కార్యకర్తలు ధీమాతో ఉన్నారు. కాగా  ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయనేది మధ్యాహ్నం వరకు తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: