ఈరోజు ఉదయం 8 గంటలకు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 9 కార్పొరేషన్లలోని 324 డివిజన్లకు, 120 మున్సిపాలిటీల్లోని 2,647 వార్డులకు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపు కోసం 134 కౌంటింగ్ కేంద్రాల్లో 2,169 టేబుళ్లను ఏర్పాటు చేశారు. తక్కువ పోలింగ్ కేంద్రాలున్న వార్డుల ఫలితాలు త్వరగా వెలువడనున్నాయి. కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నానికి స్పష్టత రానుంది. 
 
టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో రెండు మున్సిపాలిటీలు చేరాయి. అదిలాబాద్ జిల్లా చెన్నూరులో 18 వార్డులు ఉంటే 18 వార్డులలో 7 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలలో టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ముందంజలో ఉంది. మిగతా వార్డుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉండటంతో చెన్నూరు మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో చేరిందని చెప్పవచ్చు. బాల్క సుమన్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకుందని చెప్పవచ్చు. 
 
వరంగల్ జిల్లా పరకాలలో కూడా 22 వార్డులు ఉండగా ఇప్పటికే 11వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పటికే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మిగతా వార్డులలో విజయం సాధించి మున్సిపాలిటీ గెలుచుకుంది. పురపాలక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ లో తొలి విజయం నమోదు చేసుకుంది. ఆలగిరి చిత్ర డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 
 
సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ 4 చోట్ల విజయం సాధించింది. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో టీఆర్ఎస్ ఒక స్థానంలో గెలుపొందింది. వరంగల్ రూరల్ మున్సిపాలిటీలోని 17వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డుల్లో 4 చోట్ల టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తోంది.             

మరింత సమాచారం తెలుసుకోండి: