మున్సిపల్ ఎలక్షన్స్ రిజల్ట్ స్టార్ట్ అయ్యాయి. ప్రతి మున్సిపాలిటీలో ఉన్న అభ్యర్ధుల్లో టెన్సన్ మొదలవగా అధికార పార్టీ నాయకులు మాత్రం విజయం తమదే అనే ధీమాలో ఉన్నారు. వారు అనుకున్నట్లుగానే టీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తు అయినా కారు బ్రేకులు వేయకుండా దూసుకు పోతుంది.

 

 

ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఖాతాలో విజయాలు ఈ మున్సిపాలిటీల్లో మొదలైయ్యాయి. అవేమంటే సిరిసిల్ల, బొల్లారం, హూజూరాబాద్, పరకాల, చెన్నూరు, వేములవాడ, కేతన్ పల్లిలో అడ్డు లేకుండా అధికారపార్టీ దూసుకు పోతుంది. ఇకపోతే ఈ రోజు ఉదయం ఉదయం 8గంటలకు ప్రారంభం అయిన కౌంటింగ్ కేంద్రం వద్దకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు చేరుకుని  ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. కనీసం మున్సిపల్ ఎలక్షన్స్ లో అయినా తమ పరువు కాపాడుకుందామని ప్రయత్నించే ప్రతిపక్షాలకు కూడా ఈ సారు అవమానం తప్పేలా లేదనుకుంటున్నారట. కొందరు.

 

 

ఇక ఈ ఓట్ల కౌంటింగ్‌ మధ్యాహ్నం కల్లా పూర్తి కానుంది. కార్పొరేషన్‌, మున్సిపాల్టీల్లో గెలుపుపై ధీమాగా ఉంది అధికార టీఆర్‌ఎస్‌. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా అభ్యర్థులను క్యాంప్‌కు తరలించింది. పలువురు ఎమ్మెల్యేలు మున్సిపాలిటీల్లో తమ అభ్యర్థులను కర్నాటక, మహారాష్ట్ర, గోవాకు షిప్ట్ చేశారు. ఆయా నియోజకవర్గాల్లో గెలుపును తమ ఖాతాలో ఎలా వేసుకోవాలి.. అందుకు అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.. ఇకపోతే రిజల్ట్ మాట ఎలా ఉన్నా.. మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు పార్టీలు అప్పుడే కసరత్తు మొదలెట్టాయి.

 

 

గెలుపు గుర్రాలను శిబిరాలకు తరలించడం.. మేయర్‌, చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవడంపై ఫోకస్ పెట్టాయి. తెలంగాణలో క్యాంప్‌ పాలిటిక్స్‌ కాక పెంచుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పుడెక్కడా కనిపించడం లేదు. వాళ్లందర్నీ ఇప్పటికే క్యాంప్‌లకు తరలించాయి రాజకీయ పార్టీలు. మేయర్‌, చైర్మన్‌ ఎన్నికల వరకు వాళ్లంతా పార్టీ ఏర్పాటు చేసిన శిబిరాలకే పరిమితం కానున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: