తెలంగాణలో మరోసారి కారు దుమ్మురేపుకుంటూ దుసుకుపోతోంది.. మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి ఏకపక్ష విజయం దిశగా ఉరకలు వేస్తోంది. పార్టీ తొలి విజయం సాధించేసింది. మరిపెడ మున్సిపాల్టీలో టీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేసింది. ఈ మరిపెడ మున్సిపాలిటిలో మొత్తం 15 వార్డుల్లోనూ టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. వార్డుల వారీగా విజయాలను అనౌన్స్ చేస్తున్నారు ఎన్నికల అధికారులు.

 

 

మరిపెడలో మాత్రం కారుకు బ్రేకులు వేయడం ఏ పార్టీ వల్ల కాలేదు. అక్కడ 15 స్థానాలకు 15 టీఆర్ఎస్ గెలుచుకుంది. వర్థన్నపేట, మరిపెడ, దర్మపురి మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక మిగిలిన స్థానాల విషయానికి వస్తే ఇప్పటి వరకూ ఉన్న సమాచారం మేరకు.. హుజూర్ నగర్ 3వ వార్డులో తొలి ఫలితంలో విక్టరీ కొట్టింది టీఆర్ఎస్. దీంతో పాటు పలుచోట్ల విజయం సాధించింది. వర్దన్నపేట 4 వార్డుల్లో కాంగ్రెస్, 2,6,8 టీఆర్ఎస్ విజయం సాధించింది. 3వ వార్డులో బీజేపీ గెలిచింది.

 

 

ఇక తుక్కుగూడ 6వ వార్డు, లో బీజేపీ, వైరా 7వ వార్డులో టీఆర్ఎస్, నేరుడుచెర్ల 1వ వార్డులో కాంగ్రెస్, మీర్ పేట కార్పొరేషన్ లో బీజేపీ గెలిచింది. చిట్యాల 4వ వార్డులో కాంగ్రెస్ విక్టరీ. డోర్నకల్ 11వ వార్డులో టీఆర్ఎస్ గెలిచాయి. ధర్మపురిలో టీఆర్ఎస్ 8 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ 7 స్థానాలను గెలుచుకుంది. ఇక్కడ బీజేపీ ఖాతా తెరవలేకపోవడం విశేషం.

 

 

తెలంగాణ వ్యాప్తంగా జనవరి 22న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. వాటికి సంబంధించిన కౌంటింగ్ ఈ ఉదయం మొదలైంది. కౌంటింగ్‌లో భాగంగా సర్వీస్ ఓట్లు ముందు లెక్కించి.. ఆ తర్వాత బ్యాలెట్ ఓట్లు లెక్కించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే బ్యాలెట్ ఓట్లలో ముందుగా వార్డులకు సంబంధించిన ఓట్లు లెక్కిస్తున్నారు. వార్డులకు సంబంధించి అధికార టీఆర్ఎస్ జోరు మీదుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: