తెలంగాణ మున్సిపల్ పోల్స్ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెల్లడవుతున్నాయి. ఈ మున్సిపల్ ఫలితాలలో కూడా కారు జోరు ఏ మాత్రం తగ్గలేదు.. మొన్న బై ఎలెక్షన్స్ లో కూడా కారు జోరు ఏ మాత్రం తగ్గలేదు. అసలు టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ రెండు జాతీయ పార్టీలను తొక్కి పారేస్తుతుంది. 

 

అసలు ఎక్కడైనా కూడా జాతీయ పార్టీలు ఉన్న చోట ప్రాంతీయ పార్టీలకు చోటు ఉండదు.. ఎక్కువ శాతం జాతీయ పార్టీలకే మెజారిటీ ఉంటుంది. కానీ మన తెలంగాణాలో మాత్రం రెండు జాతీయ పార్టీలను ఒకే ఒక్కడు కేసీఆర్ ప్రాంతీయ పార్టీతో విజయాన్ని తనవైపుకు తిప్పుకుంటున్నాడు. వారిలో వారికే చెక్ పెడుతూ.. రాజకీయం చేస్తున్నాడు. 

 

బలవంతుడు.. ముండివాడు. అనుకున్న చోటా ఎలా అయినా సరే విజయం సాధించాల్సిందే.. రెండు జాతీయ పార్టీలలో అంతమంది నాయకులూ ఉన్నారు.. కానీ ప్రయోజనం ఏంది? కనీసం కారుకు బ్రేకులు కూడా వేయలేక పోతున్నారు.. కారు జోరుని ఏ మాత్రం ఆపలేక పోతున్నారు.. ఎంత గుంపు ఉంటె ఏం లాభం? ఒక్కడిని ఆపలేకపోతున్నారు. 

 

కేసీఆర్ ఒక్కడే రాష్ట్రాన్ని ఏలుతున్నాడు.. ఇది కదా హీరోయిజం అంటే.. మాకు మేమె హీరో.. మాకు మేమె పోటీ అని అంటూ ఉంటారు... కానీ హీరో అంటే కేసీఆర్.. హీరోయిజం అంటే కేసీఆర్ ది. అంతమంది నాయకులను ఒకేఒక్క కేసీఆర్ ఒక్క వ్యూహంతో దెబ్బ కొట్టాడు.. ఒక్క ఇప్పుడే కాదు.. 2018 సర్వత్రా ఎన్నికల్లో కూడా అనుకోని రీతిలో కారు పరుగులు తీసింది. 

 

అక్కడ ఉన్న కొడంగల్ పులి రేవంత్ రెడ్డిని.. 'ఉత్త' మ్ కుమార్ రెడ్డిని.. ఇటు లక్ష్మణ్ లాంటివారిపై కూడా విజయ సాధించారు కేసీఆర్. కొడంగల్ పులిని పిల్లిని చేశారు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త మ్ కుమార్ చేశారు.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో 10 మున్సిపాలిటీలు టీఆర్ఎస్ కే సొంతం అయ్యాయి.. రెండు జాతీయ పార్టీలను వెనక్కి నెట్టి కారు జోరుగా వెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: