పశ్చిమ బెంగాల్.. ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడ కమ్యూనిస్టులదే అధికారం.. ఎన్నికలు ఏవైనా సరే.. అక్కడ ఎగిరింది ఒకే ఒక జెండా..అదే ఎర్రజెండా.. జ్యోతి బసు వంటి రాజకీయ దిగ్గజం హయాంలో పశ్చిమ బెంగాల్లో సీపీఎం ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు అదే సీన్ తెలంగాణలోనూ కనిపిస్తోంది.

 

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ప్రతి ఎన్నికల్లోనూ విజయమే. అడ్డు అదుపు అన్నదే లేకుండాపోయింది. ప్రతిపక్షం అంటే ఎవరో వెదుక్కోవాల్సిన పరిస్థితి. ఎన్నిక ఏదైనా.. ప్రాంతం ఏదైనా ఇక్కడ ఇప్పుడు ఎగురుతోంది గులాబీ జెండా ఒక్కటి మాత్రమే. గ‌తేడాది మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ భారీ విజయాల్ని నమోదు చేసింది.

 

 

మొత్తం 32 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను టిఆర్ఎస్ దక్కించుకుంది. కాంగ్రెస్, బీజేపీ సహా ఏ పార్టీకి ఒక్క జడ్పీ స్థానం దక్కలేదు. 537 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే, టీఆర్ఎస్ పార్టీ 448 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ 75 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు దక్కించుకోగలిగాయి.

 

ఇక 2018 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించి, రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ 88 స్థానాలు , కాంగ్రెస్ 19 , బిజెపి ఒకటి, ఎంఐఎం 7 స్థానాలు గెలుచుకున్నాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ .. తెలంగాణలో టిఆర్ఎస్ ఆధిక్యం కొనసాగింది. 17 లోక్ సభ స్థానాలకు గానూ.. 9 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ 3 , బిజెపి 4, ఎంఐఎం ఒక్కసీటు గెల్చుకున్నాయి. ఫైన‌ల్ ప‌రీక్షగా మున్సిపాల్టీలు ఇవి వ‌న్‌సైడ్ అంటే కేటీఆర్ కు ఈ ఎన్నికల్లో 100కు 100 మార్కులే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: