తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు బాగా కనిపిస్తోంది. ఈ ఫలితాలతో టిఆర్ఎస్ లో ఎక్కడలేని జోష్ కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, టిఆర్ఎస్ నాయకులు ఈ ఫలితాలపై సంబరాలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే తెలంగాణ భవన్ కు చేరుకుని అక్కడ నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు 120 మున్సిపాల్టీల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించగా, ప్రతిపక్ష కాంగ్రెస్ డీలా పడింది. దీంతో తెలంగాణ భవన్ వద్ద టిఆర్ఎస్ నాయకులు సందడి నెలకొంది. ఈ నెల 22న ఎన్నికలు జరిగిన కార్పొరేషన్లలో ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తొమ్మిది కార్పొరేషన్ లోన్ కారు జోరు కనిపించే అవకాశం ఉంది.


ఇక ఈ ఫలితాలతో తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు మారుమోగుతున్నాయి. మున్సిపల్ ఫలితాలతో కేటీఆర్ తన సత్తా చాటుకున్నాడు. ఇక ముందు ముందు పార్టీని కూడా ఇదే విధంగా కేటీఆర్ సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్ళగలరు అనే నమ్మకాన్ని పార్టీ శ్రేణులు బలంగా చెబుతున్నాయి. రాజకీయ వ్యూహాలతో కేటీఆర్ ప్రత్యర్థులను డిఫెన్స్ లో పడేయడమే కాకుండా టిఆర్ఎస్ శ్రేణులు గెలుపుపై భరోసా కలిగించే విధంగా కేటీఆర్ అన్ని రకాల జాగ్రత్తలు ముందే తీసుకున్నారు. ఎక్కడికక్కడ ముందుగానే నాయకుల పనితీరు, ప్రజల నాడి పరిశీలిస్తూ దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేటీఆర్ ప్రతిభకు నిదర్శనంగా ఉండడమే కాకుండా కాబోయే సీఎం కేటీఆర్ అనే నినాదాలు మారుమోగుతున్నాయి.


ఇప్పుడు తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ అనే నినాదం సొంత పార్టీ నాయకుల నుంచే కాకుండా, ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా వస్తుండటం కేటీఆర్ ప్రతిభను చాటి చెపుతున్నాయి. చాలా కాలం నుంచి తెలంగాణ సీఎం గా కేటీఆర్ కు కెసిఆర్ బాధ్యతలు అప్పగిస్తారని అంతా భావిస్తున్న తరుణంలో కెసిఆర్ ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మాత్రం మున్సిపల్ ఫలితాలతో ఉత్సాహంలో ఉన్న పార్టీ క్యాడర్ కేటీఆర్ ను సీఎం చేయాలంటూ నినాదాలతో మారుమోగిస్తున్నారు. కెసిఆర్ కూడా కేటీఆర్ కు కు బాధ్యతలు అప్పగించి తాను జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: