మున్సిపల్ ఎన్నికల్లో కారు దూసుకుపోతోంది. అదీ కూడూ మామూలు స్పీడుతో కాదు సుమా.. అయితే అక్కడక్కడా కారు పార్టీకి కూడా బ్రేకులు పడ్డాయి. అలాంటి బ్రేకులు పడిన ప్రాంతాల్లో ఐజ మున్సిపాలిటీ ఒకటి. అయితే ఇక్కడ కారు జోరుకు బ్రేకులు వేసింది ప్రధాన ప్రతిపక్షంగా పేరుబడిన కాంగ్రెస్ పార్టీయో.. లేదా.. ఇకపై తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేది మేమే అని జబ్బలు చరుచుకునే కమల దళమా.. అంటే అదీ కాదు.

 

మరి అటు బీజేపీ కాకుండా.. ఇటు కాంగ్రెస్ కాకుండా గులాబీ పార్టీకి చెక్ పెట్టే సత్తా ఎవరిక ఉందని ఆలోచిస్తున్నారు. కొంపదీసి సైకిల్ కాదు కదా అన్న ఆలోచన వచ్చిందా.. అంత సీన్ మాత్రం లేదు. మరి ఇంకెవరంటారా.. ఇంకా ఎవరు గులాబీ దళంలోనే తిరుగుబాట దళం.. అంటే రెబల్స్ అన్నమాట. అలా పార్టీ నిర్ణయాన్ని ధిక్కించిన గులాబీ నేతలే ఇప్పుడు సొంత పార్టీపై ఆధిపత్యం కనపరిచారన్నమాట.

 

అది సరే.. అసలు వీళ్లంతా రెబల్స్ గా ఎందుకు మారాల్సి వచ్చింది. సొంత పార్టీ నే కాదని రెబల్స్ గా ఎందుకు బరిలో దిగాల్సి వచ్చింది. ఇందుకూ కారణాలు ఉన్నాయి. మ‌హూబ్‌న‌గ‌ర్ జిల్లా ఐజ మున్సిపాల్టీ అంటే.. అది మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఇలాకా అన్నమాట. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జూపల్లి కృష్ణారావు ఓడిపోయిన సంగతి తెలిసిందే. అలా ఓటమి ద్వారా పార్టీ అధిష్టానం వద్ద జూపల్లి పలుకుబడి కాస్త తగ్గింది.

 

అంతే కాదు.. అసెంబ్లీ ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావును ఓడించిన కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పరపతి కాస్త పెరిగింది. తాజా మున్సిపల్ ఎన్నికల విషయంలో ఇదే జరిగింది. మాజీ మంత్రి కృష్ణారావు మాట కంటే.. ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి మాటకే విలువ ఇచ్చి టికెట్ల కేటాయింపు చేశారు. దీంతో మండిపడిన స్థానిక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి వర్గీయులు కూడా బరిలో దిగారు. చివరకు మాజీ మంత్రి జూపల్లి పెత్తనమే చెల్లింది. అలా ఈ ఐజ మన్సిపాలిటీ టీఆర్ఎస్ రెబల్స్ చేతికి వచ్చింది. మరి వీరు టీఆర్ఎస్ లో చేరడం లాంఛనమే కావచ్చంటున్నారు సినీ ప్రియులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: