రాజకీయాల్లో ఇప్పుడు సంచలనానికి కేంద్రబిందువుగా టీఆర్‌ఎస్‌ పార్టీ మారిందంటున్నారు. ఎందుకంటే వరుసగా వస్తున్న ఎలక్షన్లలో ప్రతిపక్షాలను ఊపిరి కూడా తీసుకోవడానికి కూడా ఆలోచించ లేని విధంగా దెబ్బ మీద దెబ్బ కొడుతూ వరుసగా విజయాలు నమోదు చేసుకుంటు వస్తున్న అధికార పార్టీ గెలుపు సూత్రాన్ని అర్ధం చేసుకోలేక ప్రతిపక్ష నాయకులు తికమక పడుతున్నారట. ఇకపోతే అతి కీలకమైన కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌పై విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కారు జోరును అడ్డుకోలేకపోయాయి.

 

 

చరిత్రలో లేని విధంగా రెండు డివిజన్లను ఏకగ్రీవం చేసుకుని సత్తా చాటిన అధికార టీఆర్‌ఎస్‌, శుక్రవారం 58 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. ప్రతి డివిజన్‌లో అభ్యర్థులను వెంటేసుకుని ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించిన మంత్రి గంగుల ప్రజల మధ్యన మెదులుతూ అన్ని డివిజన్ల అభివృద్ధి బాధ్యత తనదేనని హామీ ఇస్తూ వచ్చారు. ఆయన చేసిన ప్రచారం, ఇచ్చిన హామీలు నగర ప్రజలపై ప్రభావం చూపినట్లు శుక్రవారం జరిగిన ఓటింగ్‌ సరళిని బట్టి స్పష్టంగా తెలుస్తోంది.

 

 

ఇదిలా ఉండగా కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మున్సిపాలిటీని టీఆర్ఎస్ గెలుచుకుంది. మొత్తం 12 వార్డులకు గాను… 11 స్థానాల్లో టీఆర్ఎస్.. ఘన విజయం సాధించింది. ఒక స్థానంలో కాంగ్రెస్ గెలుపొందింది. ఇదే కాకుండా క‌రీంన‌గ‌ర్ జిల్లా మంథ‌ని మునిసిపాల్టీలో కూడా కారుకు బ్రేకులు వేసే వారు లేరు. ఇక ఇప్పటి వరకు జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా బందోస్తు ఏర్పాటు చేసారు. ఇకపోతే రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలో కొందరు కార్య కర్తలు గొడవ చేశారు. రామగుండం కేంద్రంలోకి వెళ్లిన ఎమ్మెల్యే చందర్‌.. బయటకు రావాలని అభ్యర్థులు ఆందోళన చేశారు.

 

 

వరంగల్‌ నర్సంపేట్‌ లో ఏడు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు తిరస్కరణ కాగా.. సదాశివపేట మున్సిపల్ ఎన్నికల్లో 47 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మొత్తానికి ఈ ఎన్నికల్లో కూడా ప్రత్యర్ది పార్టీలకు టీఆర్ఎస్ గట్టిపోటీనిచ్చి, వారిపై ఉన్న అనుమానాలకు సమాధానంగా ఊహించలేని విజయాలను నమోదు చేసుకుంటూ ముందుకు వెళ్లుతుంది..

 

 

ఇకపోతే పీసీసీ రేసులో ముందున్న మాజీ మంత్రి శ్రీధర్ బాబు మంథనీ నియోజకవర్గం, భూపాలపల్లి జిల్లాల్లో ఎన్నికల బాధ్యతలు చూస్తుకున్నారు.. తను ప్రాతినిద్యం వహిస్తున్న చోట పార్టీని గెలిపించి పట్టునిరూపించుకోవాలనుకున్నారు కానీ ఈ ఓటమితో ఇప్పుడు మాజీ మంత్రి శ్రీధర్ బాబు పరిస్దితి అర్ధం కాకుండా తయారైయ్యింది. కారు దెబ్బకు కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: