తెలంగాణలోతెలుగుదేశం పార్టీ ఉందా.. ఈ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం తాజాగా జరుగుతున్న మన్సిపల్ ఎన్నికలు.. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో మొత్తం రాష్ట్రాన్ని పాలించిన పార్టీకి ఇప్పుడు కనీసం ఒక్కటంటే ఒక్క మున్సిపాలిటీ గెలుచుకునే పరిస్థితి లేదు. అయితే ఈ విషయం తెలుగు దేశం అధినేత చంద్రబాబుకూ తెలుసు. అసలు ఏపీలోనే అంతంత మాత్రంగా పార్టీ పరిస్థితి ఉంటే.. పాపం ఆయన తెలంగాణ లో తన పార్టీ కుమ్మేస్తుందని మాత్రం ఎలా అనుకుంటారు.

 

కాకపోతే.. మొత్తం తెలంగాణలో చంద్రబాబు ఆశలు పెట్టుకున్న మున్సిపాలిటీ ఏదైనా ఉంటే అది ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మాత్రమే. అందుకూ ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటంటే.. మొన్నటి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఇద్దరే ఇద్దరు టీడీపీ తరపున గెలిచారు. అందులో ఒకరు సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య. ఆయన ఇక్కడ వరసగా మూడోసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు.

 

అందుకే చంద్రబాబు స‌త్తుప‌ల్లిపై నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ఆశలు ఏమాత్రం తీరే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు 23 వార్డుల‌కు ముందే 8 టీఆర్ఎస్‌కు ఏక‌గ్రీవం అయ్యాయి. ఇంకా అక్కడ టీఆర్ఎస్ నాలుగు గెలిస్తే చాలు. దీనికితోడు ఇక్కడ పోటీ చతుర్ముఖంగా ఉంది. ఎమ్మెల్యే సండ్ర టీఆర్ఎస్ లోకి వెళ్లడం వల్ల సత్తుపల్లిలో టీడీపీ అడ్రస్ పూర్తిగా గల్లంతైంది.

 

మొత్తం మీద అలా చంద్రబాబు ఆశలు ఆవిరి అయ్యాయి. ఇక్కడ తెలుగుదేశం పూర్తిగా డీలా పడితే.. అనూహ్యంగా బీజేపీ టీఆర్ ఎస్ గట్టి పోటీ ఇస్తుందా అనిపించింది. ఎందుకంటే.. స్తానికంగా పేరున్న ఉడతనేని అప్పారావు వంటి నాయకులు చివరి నిమిషంలోబీజేపీలోకి వెళ్లారు. ఏదేమైనా.. తెలంగాణలో చంద్రబాబు ఆశలు పెట్టుకున్న ఆ ఒకే ఒక్కస్థానం కూడా గెలిచే అవకాశం ఏమాత్ర కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: