తెలంగాణలో కారు బ్రేకులు లేకుండా దూసుకుపోతున్నది.  రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గంలో కూడా తన ప్రభావం చూపిస్తూనే ఉన్నది.  ఇప్పటికే చాలా నియోజక వర్గాలను సొంతం చేసుకున్న తెరాస పార్టీ మరికొన్ని నియోజక వర్గాల్లో టాప్ స్పీడ్ లో దూసుకుపోతున్నది. నిజామాబాద్ జిల్లాలో తన సత్తా చాటాలని చూసిన బీజేపీకి శృంగభంగం అయ్యింది.  


ఎలాగైనా గెలిచి విజయం సాధించాలి అనుకున్న బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ లోని భీంగల్ నియోజక వర్గం షాక్ ఇచ్చింది.  ఈ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా, ఒక వార్డు ఏకగ్రీవం అయ్యింది.  మిగతా 11 వార్డులకు ఎన్నికలు జరగ్గా ఈ 11 వార్డులను కూడా తెరాస పార్టీ కైవసం చేసుకుంది.  12 వార్డుల్లో తెరాస పార్టీ విజయం సాధించడంతో ఆ పార్టీ పండగ చేసుకుంటోంది.  


బీజేపీకి చెక్ పెట్టాలి అనుకున్న తెరాస పార్టీ అనుకున్నట్టుగానే చెక్ పెట్టి వావ్ అనిపించుకుంది.  దీంతో పాటుగా అన్ని చోట్ల కూడా తెరాస పార్టీ తిరుగులేని ఆధిపత్యం సాధిస్తూ వస్తోంది. కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలు, రైతులకు ఇస్తున్న భరోసా ఇవన్నీ కూడా ఆ పార్టీకి కలిసి వస్తున్నాయి.  అయితే, కొల్హాపూర్, ఐజా మున్సిపాలిటీలలో మాత్రం ఆ పార్టీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది.  


ఇకపోతే, ఈ నియోజకా వర్గాలతో పాటుగా, కేటీఆర్ సొంత మున్సిపాలిటీ సిరిసిల్లలో కూడా కొంత ఎదురుదెబ్బ తగిలింది.  రెబల్స్ గా పోటీ చేసిన 10మంది అభ్యర్థులు అక్కడ విజయం దిశగా దూసుకుపోతున్నారు.  మిగతా అన్ని ప్రాంతాల్లో దూసుకుపోతున్న తెరాస పార్టీకి ఈ రెండు చోట్ల మాత్రం గట్టి దెబ్బ తగిలిందని చెప్పాలి.  ఇది ఆ పార్టీకి కొంత ఇబ్బందికరమైన అంశంగా మారింది.  ఇకపోతే ఇప్పటికే వర్దన్నపేట, సత్తుపల్లి మునిసిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తెరాస పార్టీ క్లీన్ స్వీప్ చేసిన భీంగల్ మున్సిపాలిటీ మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి బాల్కొండ నియోజ‌క‌వ‌ర్గంలోది  అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: