తెలంగాణ వ్యాప్తంగా కారు జోరు కొనసాగుతుంటే , మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ లో మాత్రం కారు జోరుకు బ్రేకులు పడ్డాయి . చౌటుప్పల్ మున్సిపాలిటీ హంగ్  ఏర్పడింది . ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించలేదు . మొత్తం 20 వార్డులున్న చౌటుప్పల్ మున్సిపాలిటీ లో అధికార టీఆరెస్ ఎనిమిది స్థానాలను గెల్చుకోగా , కాంగ్రెస్ ఐదు స్థానాల్లో విజయం సాధించింది . ఇక సిపిఎం మూడు, బీజేపీ రెండు స్థానాల్లో  విజయం సాధించింది .

 

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు . ఈ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు . కానీ  చౌటుప్పల్ మున్సిపాలిటీ  ఓటర్లు మాత్రం కేవలం ఐదు స్థానాల్లో  మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించారు . చౌటుప్పల్ మున్సిపాలిటీని కైవసం చేసుకుని సత్తా చాటాలనుకున్న టీఆరెస్ పార్టీకి సైతం ఎదురుదెబ్బ తగిలింది . టీఆరెస్ కు పూర్తి మెజార్టీ కట్టబెట్టకుండా , ఆ పార్టీ తరుపున పోటీ చేసిన ఎనిమిది మంది అభ్యర్థులను గెలిపించడం ద్వారా  చౌటుప్పల్ మున్సిపల్ ఓటర్లు ఆ పార్టీ వైపే మొగ్గు చూపించారు .

 

ఇక సిపిఎం , బీజేపీ లు కూడా తమ ఉనికిని చాటుకోవడం లో సక్సెస్ అయ్యాయి . అయితే మున్సిపాలిటీ ని కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ సిపిఎం పొత్తు పెట్టుకుంటుందా ? లేకపోతే  ఇతర పార్టీల తరుపున గెల్చిన కౌన్సిలర్లను తమవైపు తిప్పుకుంటుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది .  చౌటుప్పల్ మున్సిపాలిటీ లో అత్యధిక స్థానాలు సాధించిన టీఆరెస్ ఖాతాలోకి చైర్మన్ పదవి వెళ్లనుండగా , ఒకవేళ  సిపిఎం పార్టీ తో ఎన్నికల అనంతరం పొత్తు కుదిరితే ఆ పార్టీ కి వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టే అవకాశాలు లేకపోలేదు .  

మరింత సమాచారం తెలుసుకోండి: