తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం రంగంలో అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల బడా నేతలు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక సంగారెడ్డి లో కాంగ్రెస్ నుంచి తెలంగాణ టైగర్ అని పిలుచుకునే జగ్గారెడ్డి..టిఆర్ఎస్ పార్టీ నుంచి ట్రబుల్ షూటర్ హరీష్ రావు  ప్రచార రంగంలోకి దిగారు. ఇక ఎట్టకేలకు ఎన్నికల పూర్తిచేసుకుని నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ జోరు మరోసారి కొనసాగింది. 

 


 మున్సిపల్ ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ భారీ విజయం వైపుగా దూసుకుపోతుంది. ఇక సంగారెడ్డి మున్సిపాలిటీలో... మున్సిపల్ ఎన్నికల్లో పోటీ  అభ్యర్థుల మధ్య కాదు...జగ్గారెడ్డి హరీష్ రావు మధ్య పోరు అన్నట్లుగా మారిపోయింది. ఈ పోరులో హరీష్ రావు  పైచేయి సాధించారు. మొదటినుంచి జగ్గారెడ్డి పక్క ప్రచారం నిర్వహించినప్పటికీ.. ఎన్నో స్ట్రాటజీ లో అమలు చేసినప్పటికీ... హరీష్ రావు స్ట్రాటజీ ల ముందు నిలువలేక పోయారు. దీంతో సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీల్లో  జగ్గారెడ్డి కి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే దాదాపు సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయిపోయింది. 

 

 తెలంగాణ టైగర్ గా పిలుచుకునే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా  రెడ్డి సొంత నియోజకవర్గమైన సంగారెడ్డి లో కూడా... ఆయన కాంగ్రెస్ ను  గెలిపించలేకపోయారు. జగ్గా రెడ్డి సొంత నియోజకవర్గంలోనే టిఆర్ఎస్ పాగా వేసి జగ్గారెడ్డి కి భారీ షాక్ ఇచ్చింది. ఎంఐఎం సహకారంతో అత్యధిక వార్డులను గెలుచుకుని టిఆర్ఎస్ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకున్నారు. సంగారెడ్డి లో మొత్తం 38 వార్డు ఉండగా... టిఆర్ఎస్ పార్టీ 18వ వార్డుల్లో  విజయకేతనం ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ 12 ఎంఐఎం 2,  బిజెపి 3,  ఇండిపెండెంట్లు మూడు స్థానాలు దక్కించుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలవడంతో చైర్ పర్సన్ పీఠాన్ని దక్కించుకుంది. దీంతో తన సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ ను  గెలిపించలేకపోయారూ  అనే అపవాదు జగ్గారెడ్డి మూటగట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: