తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మున్సిపల్ ఎన్నికలు ఈనెల 22 జరగగా నేడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఉదయం ఎనిమిది గంటల నుంచి అధికారులు కౌంటింగ్ మొదలు పెట్టారు. భారీ బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కౌంటింగ్ చేపడుతున్నారు. ఇకపోతే మున్సిపల్ ఎన్నికలను టిఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రతి చోట టిఆర్ఎస్ పెద్దలందరూ ప్రచార రంగంలోకి దిగి ఓటర్లను ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నాలు చేశారు. ఎన్నికలు ఏవైనా ముఖ్యంగా గులాబీ దళపతి ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం పైన అందరి చూపులు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. 

 


 రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల జరిగే  ఒక ఎత్తయితే సీఎం ఇలాకాలో జరిగే పోలింగ్ మాత్రం మరో ఎత్తు అన్నట్లుగా  ఉంటుంది. ఎందుకంటే... సీఎం ఇలాకాలో ఎన్నికలు... సీఎం బలం ఎంతో నిరూపించుకునే ఎన్నికలు . అందుకే కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వెల్ ప్రజ్ఞాపూర్... ఎన్నో జాగ్రత్తలు పాటించరు అధికారులు నేతలు. ముఖ్యంగా హరీష్ రావు  రంగంలోకి దిగారు. ముందే రాష్ట్ర వ్యాప్తంగా కారు పార్టీ ఎంతో జోరు చూపిస్తుంది ... ఇక సీఎం ఇలాకాలో అన్ని సీట్లు గెలుచుకొని మిగతా పార్టీలను క్లీన్స్వీప్ చేస్తేనే... గులాబీ దళపతి సొంత నియోజకవర్గంలో ఉన్న బలం ఏంటో నిరూపణ  అవుతుంది . మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి  సీఎం సొంత ఇలాకాలో నిరాశే  ఎదురైందని చెప్పాలి. 

 

 ఏకంగా హరీష్ రావు  రంగంలోకి దిగి అన్ని వార్డులని  క్లీన్స్వీప్ చేద్దామనుకున్నప్పటికి  అధిక శాతం ఓటర్లు మాత్రం టీఆర్ఎస్ ను  నిరాశపరిచారు. కాంగ్రెస్ బీజేపీలు సీఎం ఇలాకాలో సత్తా చాటాయి.ఏకంగా  గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. ప్రస్తుత సమాచారం ప్రకారం టిఆర్ఎస్ 9 వార్డుల్లో  కాంగ్రెస్ ఒక చోట ఇతరులు నాలుగు స్థానాల్లో గెలిచారు. మొత్తంగా గజ్వేల్ నియోజకవర్గంలో 20 వార్తలు ఉన్నాయి. గులాబీ దళపతి సీఎం నియోజకవర్గం కావడంతో గజ్వేల్లో మున్సిపల్ ఎన్నికలు వైఫై అందరి చూపు మళ్లింది. ఇక సీఎం ఇలాకాలో నే కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవడం తో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక కేసిఆర్ రాజకీయ వారసుడైన కేటీఆర్ ఇలాక  సిరిసిల్లలో 10 మంది ఇండిపెండెంట్ గెలవగా  ఇక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్ తగిలినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: