గ‌త కొద్దికాలంగా త‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి హ‌రీశ్ రావు షాకిచ్చారు. సంగారెడ్డిలో కాంగ్రెసు 10 స్థానాలను దక్కించుకోగా, టీఆర్ఎస్ 15 వార్జులను దక్కించుకుంది. దీంతో మున్సిపల్ పీఠం టీఆర్ఎస్ వ‌శం కానుంది. కాగా, త‌న స‌తీమ‌ణికి మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ పీఠం ద‌క్కించాల‌ని భావించిన జ‌గ్గారెడ్డికి నిరాశే ఎదురైంది. కాగా, ఈ గెలుపుతో హ‌రీశ్ రావు అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. 

 

సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్‌, అందోలు-జోగిపేట, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లా రం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. 5 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 162 వార్డులుండగా, బొల్లారంలో 3, సదాశివపేటలో ఒక వార్డు ఏకగ్రీవం కాగా, 158 వార్డులకు పోలింగ్‌ జరిగాయి. ఈ రెంటిలో సంగారెడ్డి, సదాశివపేట రెండు పార్టీల‌కు కీల‌కంగా మారాయి. అయితే, ఈ రెండింటినీ ప్రతిష్టాత్మ‌కంగా తీసుకున్న మంత్రి హ‌రీశ్ రెండు పుర‌పాలిక‌ల‌పై గులాబీ జెండా ఎగుర‌వేయించారు. అయితే, సంగారెడ్డి నుంచి కాంగ్రెస్‌ చైర్ పర్సన్ అభ్యర్థిగా బ‌రిలో దిగిన జ‌గ్గారెడ్డి సతీమణి  నిర్మల గెలుపొంద‌డం ఒక్క‌టే ఆయ‌న‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించే అంశం.

 

ఇదిలాఉండ‌గా, విజ‌యంపై ఆశ‌లు పెట్టుకున్న కాంగ్రెస్ ముందుగానే కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను బీదర్‌కు తరలించింది. సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకునేలా కాంగ్రెస్‌ ప్లాన్‌ చేసింది. ఏ ఒక్కరూ చేజారకుండా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, ఎన్నికల్లో గెలుపొందిన వారికి నోటీసులు కూడా అందిస్తారు. 27న చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపికకు హాజరుకావాలని ఆ నోటీసులో సూచిస్తారు. అధికారులు సూచించిన 27న చేతులు ఎత్తే పద్ధతిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లును ఎన్నుకోనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు సభ్యులు ప్రమా ణ స్వీకారం చేసి,  12.30 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకుంటారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: