ఏదైనా పార్టీకి వారి అధ్యక్షుడే ముఖచిత్రం. టిఆర్ఎస్ కు కెసిఆర్ అన్నా వైఎస్ఆర్సిపి కి జగన్ అన్నా టిడిపి కి చంద్రబాబు అన్నా జనసేన పవన్ కళ్యాణ్ అన్నా చివరికి ఆప్ కు కేజ్రీవాల్ అన్నా అది ఒక హాల్ మార్క్ లాంటిది. వారిని దృష్టిలో పెట్టుకుని వారి పార్టీ గుర్తు కి పూనకం వచ్చినట్లు వారి మద్దతుదారులు, కార్యకర్తలు మరియు అభిమానులు అంతా పూనకం వచ్చినట్లు ఓట్లు వేస్తుంటారు రోడ్లమీద తిరిగి ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో బీజేపీ పార్టీ ముఖ చిత్రమైన మోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో తమ పార్టీ కార్యకర్తలందరినీ ఉత్తేజపరచడం లో మోడీ ముందు ఉంటాడు.

 

అయితే తెలంగాణ ప్రజల్లో మాత్రం మోడీ తనదైన ముద్ర వేసుకున్నా కూడా అతని పార్టీ మాత్రం ముందుకు వెళ్లే రీతిలో వారిని ప్రభావితం చేయలేక పోతున్నాడు. ఇప్పుడే కాదు మొదటి నుంచి తెలంగాణ ప్రజలు బిజెపి పార్టీ ని టీఆరెఎస్ కు ఒక ప్రత్యామ్నాయంగా అయితే ఎన్నడూ అనుకోనే లేదు. వారందరికీ మోడీ అంటే విపరీతమైన అభిమానం ఉన్నా కానీ తెలంగాణ బిజెపి పార్టీలో ఉన్న సభ్యులు వల్లనో లేదా టిఆర్ఎస్ పార్టీ పైన ఉన్న అపారమైన నమ్మకం మీదనే ఇక ఏ ఇతర కారణాలు ఉన్నయో తెలియదు కానీ మోడీ యొక్క పార్టీకి మాత్రం వారు ఏనాడు సరైన రీతిలో సహకరించలేదు అనే చెప్పాలి.

 

గత సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మోడీ ప్రభంజనం ద్వారానే అదే ఊపులో జనాలు బిజెపికి ఓటు వేశారు తప్ప తమ అజెండా మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో కమలం పార్టీ కి మొహం మీద చెప్పేశారు. అలాగని మోడీ ఇమేజ్ పడిపోతుంది అంటే అదీ కాదు. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు పెట్టినా కూడా బిజెపి కనీసం ఐదు సీట్లు గెలుచుకుంటుంది. దానికి కారణం మోడీ తప్ప ఇక మరే ఇతర బిజెపి పార్టీ నాయకుడు కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: