తెరాస పార్టీ ఈ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది.  వందకు పైగా స్థానాలు గెలుచుకొని సంబరాలు చేసుకుంటోంది.  మంత్రులకు బాధ్యతలు అప్పగించడంతో కిందామీదా పడి ఏదోలా గెలుచుకుంటూ వస్తున్నారు.  ఈ ఎన్నికల్లో విజయం సాధించడం వెనుక కేటీఆర్ మాస్టర్ మైండ్ ఉన్నది.  కేటీఆర్ ను వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఏర్పాటు చేసిన తరువాత పార్టీని దూసుకుపోయేలా చేస్తున్నారు.  కెసిఆర్ ప్రతి విషయంలో దూసుకుపోతున్నారు. 


ప్రతి ఒక్కరిలో విజయం సాధించే స్తైర్యాన్ని నింపిన వ్యక్తి కేటీఆర్.  ఎప్పటికప్పుడు నేతలను, కార్యకర్తలను మోటివేట్ చేస్తూ స్ఫూర్తిని నింపుతూ ఎన్నికలకు సమయాత్తం చేశారు.  ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టారు.  ఎన్నికల్లో విజయం సాధించడానికి ఓ కారణాం ఉన్నది.  ఎన్నికలు ఎలా మొదలుపెట్టాలి.  ఎలా ఉండాలి అనే దానిపై మొదట్లో ఒక అవగాహనకు వచ్చి, మంత్రులకు అప్పగిస్తే ఆ బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు అని భావించారు.  


అలా భావించిన తెరాస పార్టీ, ఆచరణలో కూడా చేసి చూపించింది.  మంత్రులపై భారం వేయడంతో, మంత్రులు ఈ విషయాలను తమ బాధ్యతగా తీసుకొని ముందుకు నడిపించారు.  పార్టీ తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వ పధకాలు, తెరాస కాకుండా మరెవరైనా వస్తే పరిస్థితి ఏంటి.  మరో పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు.  


అదే విధంగా గతంలో తెరాస పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేశారు.  పార్టీ సిద్ధాంతాలను, ప్రజల్లోకి తీసుకెళ్లారు.  ఉద్యమం తరువాత తెరాస పార్టీ తెలంగాణలో బలంగా పాతుకుపోయింది.  కెసిఆర్ సెంటిమెంట్ ద్వారా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్తే... కేటీఆర్ మాత్రం అభివృద్ధి మంత్రంతో పార్టీని ముందుకు తీసుకెళ్లి విజయం సాధించారు.  దీనికి ఓ ఉదాహరణ ఈ ఎన్నికలే అని చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: