ఈరోజు మున్సిపాలిటీ ఫలితాలు విడుదల అయ్యాయి.. అయితే.. గెలుపు అనేది ఒకరికి ఓటమి అనేది మరొకరికి వస్తుంది. ఎక్కడైనా అదే వస్తుంది. ఎక్కడైనా ఒకరే గెలుస్తారు.. కానీ అక్కడ మాత్రమే పోటీ చేసిన వారందరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. అదేంటీ? ఆలా ఎలా వస్తాయి ? అని ఆశ్చర్యపోతున్నారా? 

 

కానీ నిజం అండి బాబు. ఆ మున్సిపాల్టీలో పోటీ చేసిన అందరూ గెలిచారు.. ఎలాగనేది ఇక్కడ చదవండి.. మీకే తెలుస్తుంది. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో హంగ్ పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ అన్ని పార్టీలకు ప్రాధాన్యం ఇచ్చారు ఓటర్లు. మొత్తం 10 స్థానాల్లో సీపీఎం 2, సీపీఐ 1, టీడీపీ 1, టీఆర్ఎస్ 3, బీజేపీ 1, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్స్ 1 స్థానంలో గెలుపొందారు. 

 

ఇప్పుడు ఇక్కడ చైర్మన్ పీఠం ఎవరు సొంతం చేసుకుంటారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఒక ఇండిపెండెంట్‌తో పాటు ఇతరులెవరినైనా లాగేసి అధికార పార్టీనే ఈ మున్సిపాిలిటీని కూడా కైవసం చేసుకునే చాన్స్ ఉందని తెలుస్తోంది. మరి ఈ వనపర్తి మున్సిపాలిటీలో ఎవరు జండా ఎగరేస్తారు అనేది చూడాలి. 

 

ఏది ఏమైనా.. ఇలా మొదటిసారి అన్ని పార్టీలకు సమన్యాయం చేశారు ప్రజలు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. కాగా జాతీయ పార్టీలను సైతం ఓడించి సీఎం కేసీఆర్ జండా ఎగరేశారు. ఇంకా రేవంత్ రెడ్డి మాటలు తప్ప మరేమి లేదు అని ఈ మున్సిపల్ లో తేలిపోయింది. 

 

ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి 'ఉత్త'మ్ కుమార్ రెడ్డి అయ్యాడు అని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. బీజేపీలో నాయకులను కూడా గెలిపించుకోలేకపోయారు. తెలంగాణాలో కేసీఆర్ కు ఎవరు సరిలేరు అని మళ్లీ నిరూపించుకున్నాడు. ఇంకా యువ నాయకుడు కేటీఆర్ కూడా తన సత్తా చాటుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: