కేసీయార్ ఏం మంత్రాలు చేస్తున్నాడో తెలియదు గాని ప్రతి ఎన్నికల్లో తిరుగులేని ఫలితాలను సాధిస్తున్నాడు. ఇప్పటికే అతని విజయ రహస్యాన్ని కనిపెట్టాలని కొందరు ప్రతిపక్ష నాయకులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇకపోతే మరికొందరు కేసీయార్ చేసిన యజ్ఞాల ఫలితాలు అతన్ని విజయం రూపంలో ఆశీర్వదిస్తున్నాయని సర్ధుకుపోతున్నారు. ఇక మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఫలితాల్లో కూడా తిరుగులేని పార్టీగా టీఆర్ఎస్ పార్టీ నిలిచింది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో దాదాపు అన్ని చోట్ల బ్రేకులు, స్పీడ్ బ్రేకర్లు లేకుండా సాఫీగా సాగుతుంది.

 

 

ఇకపోతే అధికార టీఆర్ఎస్ పార్టీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ మంచి ఫలితాలను రాబట్టింది.. ఇక్కడ మొత్తం 11 మున్సిపాలిటీలకు ఎన్నికలకు జరగగా.. మంచిర్యాల, నస్పూర్, క్యాతన్ పల్లి, నిర్మల్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, చెన్నూర్ , కాగజ్ నగర్ ఇలా మొత్తం 8 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది.. ఇక, భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకోగా..  ఖానాపూర్ లో మాత్రం  కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్‌కు సమానమైన వార్డులు రావడంతో ఫలితాలు తేలాల్సి ఉంది.

 

 

మరోవైపు ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఆనందాన్ని వ్యక్తం చేసారు.. కాగా తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. అంతే కాకుండా ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

ఇక, మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల సరళిపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో కలిసి సమీక్ష నిర్వహించారు.. ఇక మేయర్‌, ఛైర్‌పర్సన్‌ ఎన్నికల నేపథ్యంలో ఎక్స్‌ఆఫిషీయో ఓట్లపై కేటీఆర్‌ దృష్టిసారించారు. ఇక టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన అభ్యర్దుల ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. బ్యాండ్ బాజాలతో, పేలుతున్న టపాసులతో విజయయాత్రను కొనసాగిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: