తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఆ పార్టీ దెబ్బకు ప్రతిపక్షాలు సోదిలో లేకుండా పోయాయి. మొత్తం మున్సిపాలిటీ ఫలితాల్లో దాదాపు 90 శాతంపైనే స్థానాల్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఇక ఈ మున్సిపల్ ఎన్నికలతో తెలంగాణలో ఎన్నికల సందడి ముగిసినట్లే. అయితే ఇప్పటివరకు తెలంగాణలో జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగరవేసింది. అసెంబ్లీ, పంచాయితీ, స్థానిక సంస్థలు...ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, ఇలా ప్రతిదానిలోనూ టీఆర్ఎస్ దాదాపు 90 శాతం పైనే ఫలితాలు రాబట్టింది.

 

అయితే ఇదే సీన్ ఇప్పుడు ఏపీలో రిపీట్ అవుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి ప్రతిదీ అనుకూలంగానే ఉంటుంది. ప్రజలు కూడా అభివృద్ధి జరగాలంటే అధికార పక్షం వైపే చూస్తారు. కాకపోతే ప్రతిపక్షం బలంగా ఉంటే ఫలితాలు కొంచెం అటు ఇటు అయ్యే అవకాశముంది. కానీ తెలంగాణ మాదిరిగా ఏపీలో కూడా ప్రతిపక్షాలకు అంత సీన్ లేకుండా పోయింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ పరిస్తితి దారుణంగా దిగజారిపోయింది.

 

మూడు రాజధానులని వ్యతిరేకించాక అయితే టీడీపీ పట్ల వ్యతిరేకిత మరింత పెరిగింది. వీటి అన్నిటికి తోడు జగన్ పాలన పట్ల ప్రజలు ఫుల్ పాజిటివ్ గా ఉన్నారు. ఈ పరిణామాలని బట్టి చూసుకుంటే ఏపీలో రానున్న స్థానిక సంస్థలు, పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించడం ఖాయం. 2019 లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా చూసుకుంటే వైసీపీకి అన్ని జిల్లాలోనూ సానుకూలత ఉంది. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో క్లీన్ స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే ప్రధాన కార్పొరేషన్‌ల్లో కూడా వైసీపీ సత్తా చాటుతుందని అంచనాలు వేస్తున్నారు. ఇక ఎంపీటీసీ, పంచాయితీల్లో 80 శాతంపైనే విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా 13 జెడ్పీ స్థానాలు వైసీపీ ఖాతాలో సులువుగా పడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: