ఏ రాజకీయ పార్టీకైనా సీనియర్ నేతలు ఎంత అవసరమో....యువనేతలు అంతకంటే ఎక్కువ అవసరం. భవిష్యత్ వారిదే కాబట్టి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. వారికి తగిన గుర్తింపు ఇస్తే....వారి బట్టే రాష్ట్రంలో ఉన్న యువత కూడా ఆ పార్టీకి మద్ధతు తెలిపే అవకాశం ఉంటుంది. అలా కాకుండా యువ నేతలకు తగిన ప్రాధాన్యత లేకపోతే...తిరిగి వారే పార్టీకి రివర్స్ షాక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యువత మద్ధతు ఎక్కువ ఉన్న పార్టీ వైసీపీనే. ఆ విషయం ఎన్నికల్లో స్పష్టంగా అర్ధమైంది. అయితే వైసీపీ తర్వాత యువత మద్ధతు టీడీపీకి ఉంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే వైసీపీ తర్వాత కాస్త పవన్ మీద అభిమానం వల్ల..జనసేనకు యువత మద్ధతు ఉంది.

 

ఇక ఈ విషయంలో టీడీపీ మూడో స్థానంలో ఉంది. ఆ పార్టీలో సీనియర్ నేతల డామినేషన్ ఎక్కువ ఉండటం, లోకేశ్‌ని ఎక్కడ డామినేట్ చేస్తారనే భయంతో అధినేత చంద్రబాబు యువ నేతలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పార్టీకి యువత మద్ధతు కరువైంది. పైగా దేవినేని అవినాష్ జరిగిన అనుభవం దెబ్బకు యువ నేతలు పార్టీలో పెద్దగా హైలైట్ కావడం లేదు. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక, ఏ నేత బయటకు రాకపోయినా....అవినాష్ మాత్రం బయటకొచ్చి కార్యకర్తలకు మద్ధతుగా నిలిచారు.

 

అలాగే పార్టీ కార్యక్రమలో చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్ర యువత అధ్యక్షుడుగా పార్టీ కోసం కష్టపడ్డారు. అతి తక్కువ కాలంలోనే యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. కానీ ఇది చూసి ఓర్వలేని వృద్ధ నేతలు, లోకేశ్ బాబుని ఎక్కడ డామినేట్ చేస్తాడో అని చెప్పి, బాబు ద్వారా...అవినాష్‌ని అణిచే ప్రయత్నం చేశారు. ఇక ఈ విషయం అర్ధం చేసుకున్న అవినాష్, జగన్ చెంతకు చేరారు. అక్కడ అవినాష్‌కి ఎలాంటి ప్రాధాన్యత దక్కిందో అందరికీ తెలుసు.

 

ఇక ఇదే అనుభవంతో చాలామంది యువనేతలు పెద్దగా బయటకు రావడంలేదు. ఈ క్రమంలోనే బాబు జై అమరావతి అంటూ రోడ్ల మీద తిరుగుతున్న యువనేతలు మనకెందుకులే అన్నట్లు వదిలేశారు. ఏదో పరిటాల శ్రీరామ్, ఎంపీ రామ్మోహన్ నాయుడులు తప్ప, మిగతా వారు పార్టీలో కనిపించిన దాఖలాలు లేవు. ఏదేమైనా అవినాష్‌కు పడిన దెబ్బకు టీడీపీ యువనాయకత్వం సైలెంట్ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: