పురపాలక ఎన్నికల ఫలితాలు నిన్నటి రోజున రిలీజ్ అయ్యాయి.  ఈ ఎన్నికల్లో కారు యమా స్పీడ్ గా పరుగులు తీసింది.  మొత్తం 120 మున్సిపాలిటీల్లో తెరాస పార్టీ 96 మున్సిపాలిటీలు గెలుచుకొని తిరుగులేదనిపించుకుంది.  9 కార్పొరేషన్లలో 7 గెలుచుకొని రికార్డు సృష్టించింది.  గులాబీ పార్టీకి తిరుగులేదనిపించుకుంది.  అన్ని చోట్ల గులాబీ పార్టీ వికసిస్తున్న,  ఓ వార్డులో మాత్రం ఓడిపోయింది.  ఈ ఓటమితో ఆ పార్టీకి చెందిన వ్యక్తి కుంగిపోయాడు.  పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారు.  


ఇది ఆ పార్టీకి ఇబ్బందులు పెట్టింది.  ఈ సంఘటన భూపాలపల్లిలో జరిగింది.  భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో తెరాస పార్టీ తరపున 5 వార్డు నుంచి సింగనవేన విజేత అనే మహిళా పోటీ చేసింది.  అయితే ఆమె 78 ఓట్ల తేడాతో ఓడిపోయింది.  దీంతో ఆమె భర్త చిరంజీవి మనస్తాపం చెందాడు.  ఆత్మహత్య చేసుకోవాలని అనుకోని పురుగుల మందు తాగాడు.  అయితే, అక్కడే ఉన్న వ్యక్తులు సకాలంలో స్పందించడంతో వెంటనే ఆయన్ను హాస్పిటల్ కు తరలించారు.  


అసలు విషయంలోకి వెళ్తే... 2014లో చిరంజీవి కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయాడు.  ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆయన తన భార్యను పోటీలో ఉంచాడు.  ఎన్నికల్లో గెలవడం కోసం సుమారుగా రూ. 20 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు.  కానీ, విజయం వరించలేదు.  దీంతో అయన మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు.  ఓటమి కంటే కూడా రూ. 20 లక్షలు ఖర్చు చేశాననే భాధ ఎక్కువగా ఆయనను బాధపెట్టి ఉంటుంది.  


అయితే, కెసిఆర్ గారు ఈ ఎన్నికల కోసం కోటి కంటే ఎక్కువగా ఖర్చు చేయలేదని అంటున్నారు.  ఇక్కడ చూస్తే ఒక్క వార్డు కోసమే రూ. 20 లక్షలు ఖర్చు చేసినట్టుగా చెప్తున్నారు.  ఏది నిజం ఏది అబద్దం కెసిఆర్ గారు.  ఎలా దీన్ని తీసుకోవాలి.  ఎన్నికల్లో డబ్బు హవా నడిచిందని అనుకోవాలా లేదంటే పధకాలు అభివృద్దే గెలిపించాయని అనుకోవాలా ? ఎలా అనుకున్నా ఫైనల్ గా మాత్రం కారు విజయం సాధించింది.  అదే కదా ముఖ్యం.  

మరింత సమాచారం తెలుసుకోండి: