కొల్లాపూర్ మున్సిపాలిటీ లో పార్టీనిర్ణయానికి  కి వ్యతిరేకంగా రెబల్ అభ్యర్థులు నిలిపి మెజార్టీ సభ్యులను  గెలిపించుకున్న   మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కు టీఆరెస్ నాయకత్వం ఝలక్ ఇచ్చింది . జూపల్లి వర్గం మద్దతు లేకుండా టీఆరెస్ తరుపున గెల్చిన తొమ్మిది సభ్యుల్లో ఒకర్ని ఎక్స్ అఫిషియో ఓట్ల ద్వారా చైర్మన్ గా చేయాలని నిర్ణయించుకుంది . కొల్లాపూర్ మున్సిపాలిటీ లో మొత్తం 20 వార్డులు ఉండగా , జూపల్లి వర్గం 11 వార్డుల్లో కౌన్సిలర్లుగా విజయం సాధించగా , ఇక టీఆరెస్ తరుపున పోటీ చేసిన అభ్యర్థుల్లో తొమ్మిది మంది గెలుపొందారు .

 

ఎన్నికల ఫలితాలు వెలువడగానే జూపల్లి వర్గం, టీఆరెస్ నాయకత్వం చెప్పినట్లుగా నడుచుకుంటామని ప్రకటించి తమ విధేయతను ప్రకటించింది . ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ లే తమ నాయకులని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొని , మంత్రి పిలుపు మేరకు హైదరాబాద్ కు బయల్దేరి వెళ్లి కేటీఆర్ తో భేటీ అయ్యారు .  కొల్లాపూర్ మున్సిపాలిటీ జూపల్లి వర్గం కైవసం చేసుకోవడం ఖాయమని అందరూ భావిస్తున్న తరుణం లో టీఆరెస్ నాయకత్వం అనుకోని ట్విస్ట్ ఇచ్చింది . జూపల్లి వర్గం మద్దతు లేకుండానే మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకోవాలని పథకరచన చేసింది  . ఎమ్మెల్యే , ఎంపీ , ఎమ్మెల్సీ లకు ఉన్న  ఎక్స్ అఫిషియో ఓట్లను వినియోంచుకుని టీఆరెస్ తరుపున గెల్చిన వారిలో ఒకర్ని చైర్మన్ చేయాలని నిర్ణయించింది .

 

దీనిలో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిని ప్రోత్సహించామన్న అపవాదు రాకుండా టీఆరెస్ నాయకత్వం జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది . కొల్లాపూర్ లో రెబల్స్ ను ప్రోత్సహిస్తే , ఇతర మున్సిపాలిటీల్లోనూ రెబల్స్ గా  పోటీ చేసి విజయం సాధించిన వారిపై  పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటే విమర్శలు ఎదురవుతాయని టీఆరెస్ నాయకత్వం భావించినట్లు తెలుస్తోంది . మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సిరిసిల్ల లోను రెబెల్స్ గా పోటీ చేసి పలువురు విజయం సాధించారు . 

 

మరింత సమాచారం తెలుసుకోండి: