మనిషి ప్రపంచాన్ని శాసిస్తుంటే, మరణం మనిషిని శాసిస్తుంది. నేటికాలంలో అభివృద్ధికి చిరునామగా మారిన చైనా అతలాకుతలం అవుతుంది. ఇకపోతే పొరుగు దేశాల మీద అణుబాంబులు వేయడానికి కూడా సిద్దపడుతున్నారు. ప్రపంచం నాశనం చేయాలని ఎవరు కంకణం కట్టుకోవలసిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు అదేనాశనం అవుతుంది. ఇలాంటి కొత్త కొత్త రోగాలు మనుషులను పట్టిపీడిస్తూ, శ్మశానం వైపు నడిపిస్తాయి.

 

 

ఇకపోతే ఇప్పుడు సరికొత్తగా వచ్చిన ఈ కరోనా వైరస్.. ఇదో ప్రాణాంతక వైరస్.. దీని పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాల్లో వణుకు పుడుతోంది. ఎప్పుడు ఏ క్షణంలో ఈ వైరస్ ఎటాక్ చేస్తుందోనన్న భయం ప్రతివారిలో మొదలైంది.. ఈ వైరస్ వేగంగా విజృంభిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. పొరుగు దేశం చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ కరోనా వైరస్ వందల మందికి సోకింది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

 

 

ఇప్పటివరకూ 41మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. ఇక హాంకాంగ్ లో అధికారులు అత్యున్నత స్థాయి ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఫిబ్రవరి 9న జరగాల్సిన స్టాండర్డ్ చార్టర్డ్ హాంకాంగ్ మారథాన్ ను వాయిదా వేశారు. అంతే కాకుండా ఈ వైరస్ వల్ల ఒక్క రోజే 15మంది చనిపోయినట్లు అధికారులు  వెల్లడించారు.

 

 

ఇక ఈ వైరస్ ఆ పాముల మాంసం తినడం ద్వారా మనుషుల్లోకి సంక్రమించినట్టు ఇప్పటికే చైనాలోని పెకింగ్​ యూనివర్సిటీ ఆఫ్​ హెల్త్​ సైన్స్​ సెంటర్​ తమ అధ్యయనంలో వెల్లడించింది. అంతే కాకుండా గబ్బిలాల్లో ఉండే కరోనా వైరస్​ జీన్స్​ కాంబినేషన్​తో ఈ కొత్త కరోనా పుట్టుకొచ్చిందని సైంటిస్టులు తేల్చారు.

 

 

పాముల్లోని జీన్స్​తోనూ వాటిని పోల్చి చూడగా, ఒకేలా ఉన్నట్టు గుర్తించారు. మనుషుల్లో సంక్రమణకు ముందుగా పాముల్లోనే ఈ వైరస్​ ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు... ఏది ఏమైన ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతు, ఎన్ని రోగాలకు మందులు కనిపెట్టినా, వచ్చే ఆపదను ఎదుర్కొని ఆపలేడు అన్నది నిజం.  

మరింత సమాచారం తెలుసుకోండి: