గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్న రాజధాని సమస్య చివరికి ఒక కొలిక్కి వచ్చే లాగా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు నా బలాన్ని మొత్తం ఉపయోగించి శాసనసభలో వికేంద్రీకరణ బిల్లును ఆమోదన తెచ్చుకొని ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం తనకున్న అనుభవం అంతా రంగరించి శాసనమండలిలో జగన్ వ్యూహాలకు అడ్డుకట్ట వేశాడు. దీనికి జగన్ ఏమన్నా తక్కువ తిన్నాడా అంటే అది కాదు. తనదైన శైలిలో శాసనమండలిని ఏకంగా రద్దు చేసే విషయమై ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు ఏపీ ముఖ్యమంత్రి.

 

అయితే దీని తర్వాత సమీకరణలు ఎలా మారబోతున్నా గాని ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ మాత్రం చిక్కుల్లో పడినట్లే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ పరిస్థితి మండలి రద్దు వల్ల దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అసలు ఎమ్మెల్యేగా గెలవలేక పోయిన నారా లోకేష్ కు ప్రజలు మంగళగిరిలో చరమగీతం పాడారు అయినా మండలి లో ఉన్న తన సభ్యత్వంతో నెట్టుకొస్తున్న లోకేష్ చివరికి అది కూడా రద్దు అయితే రాజకీయంగా ఏకంగా 2024 అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆగవలసి ఉంటుంది.

 

ఇన్ని రోజులు తండ్రి అండతో వచ్చిన ఎమ్మెల్సీ పదవి మరియు మూడు రోజులకే జాక్ పాట్ లా దక్కిన మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని తన రాజకీయ జీవితం కొనసాగిస్తున్న లోకేష్ రెండేళ్లలోనే ఎమ్మెల్యేగా దారుణమైన ఓటమిని చవి చూసి.... ఇప్పుడు అయితే ఏం చేయాలో తెలియని పాలుపోని స్థితిలో ఉన్నాడు. ఇటువంటి దశలో శాసనసభ మండలి రద్దు విషయంలో జగన్ సక్సెస్ అయితే మాత్రం లోకేష్ కు ఆంధ్రరాష్ట్రంలో ఎటువంటి గుర్తింపు ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: