తెలుగుదేశం  పార్టీ ని వీడి  బీజేపీ లో చేరిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని ఆ పార్టీ నాయకత్వం పూర్తిగా విశ్వసించడం లేదా ?, ఇంకా ఆయన్ని టీడీపీ కోవర్ట్ గానే భావిస్తుందా ? , అందుకే సుజనాచౌదరికి ఆశించినస్థాయి లో ప్రాధాన్యత ఇవ్వడం లేదా ??? అంటే అవుననే సమాధానం  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు  విన్పిస్తోంది .  రాష్ట్ర రాజధాని అమరావతి ని తరలిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని సుజనా  పేర్కొనగా , మరొక ఎంపీ జివిఎల్ నర్సింహారావు మాత్రం రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది తేల్చిచెప్పిన విషయం తెల్సిందే .

 

సుజనా ను ఇంకా  బీజేపీ నేతగా ఆ పార్టీ నేతలు గుర్తించడం లేదని చెప్పడానికి ఇంతకంటే రుజువు ఏమి కావాలని వైస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు . ఇక విజయవాడ లో జనసేన , బీజేపీ ముఖ్యనేతల   మధ్య   జరిగిన సమావేశానికి సుజనాపార్టీ నాయకత్వం దూరం పెట్టడానికి కూడా కారణం ,  ఆయన్ని టీడీపీ కోవర్ట్ అని భావించడం వల్లేనని అంటున్నారు .  అయితే ఇదే విషయమై బీజేపీ నేతలు మాట్లాడుతూ తమ పార్టీ నేతలని తాము విశ్వసించడం లేదని చెప్పడానికి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరని ప్రశ్నిస్తున్నారు . వాళ్ళు అనుకుంటున్నది ... చెప్పాలనుకుంటున్నది బీజేపీ నాయకత్వం పై రుద్దడం వారికి  అలవాటుగా మారిందని విమర్శిస్తున్నారు . రాజధాని తరలింపు కూడా ప్రధాని , హోంమంత్రి కి చెప్పే చేశామని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడం కూడా దానిలో భాగమేనని విరుచుకుపడుతున్నారు .

 

బీజేపీ జాతీయనాయకత్వం తో స్నేహ సంబంధాలను కొనసాగించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తోన్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి  , రాష్ట్ర బీజేపీ పొడ ఏమాత్రం గిట్టడం లేదని తెలుస్తోంది . అందుకే ఆ పార్టీ నేతల విషయం లో మైండ్ గేమ్ ఆడుతూ , బీజేపీ క్యాడర్ నే గందరగోళానికి గురి చేయాలని  చూస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: