తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి తిరుగులేదు. ఎన్నికలు ఏవైనా... భారీ మెజారిటీ సొంతం చేసుకుని విజయఢంకా మోగిస్తోంది. ప్రత్యర్థులు ఎవరు ఈ పార్టీ స్పీడును ఆపలేక పోతున్నారు. ఇక తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా అసమాన్య విజయాన్ని సొంతం చేసుకుంది ఆపార్టీ. అదే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. తెలంగాణ ప్రజలను గులాబీ బాస్ ఏం చేశాడో తెలియదు కానీ... తెలంగాణ ప్రజానీకం మొత్తం గులాబీ బాస్ జపం చేస్తోంది. దీంతో ఎన్నికలు ఏవైనా తెలంగాణ ప్రజలు మొత్తం కారు పార్టీకి ఓటు వేస్తూ... టిఆర్ఎస్ పార్టీకే విజయం కట్టబెడుతున్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయఢంకా మోగించి ఘన  విజయాన్ని సొంతం చేసుకుంది టిఆర్ఎస్ పార్టీ. 

 

 

 ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసిన... ప్రజలు ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత తెచ్చేందుకు ప్రయత్నించినా... టిఆర్ఎస్ వ్యూహాల ముందు అవన్నీ పటాపంచలై పోయాయి. మరి ఈ ఈ ఘనవిజయం వెనుక అసలు పార్టీ వ్యూహమేంటి అంటే... ఓ వైపు రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం.. మరోవైపు పార్టీ పెద్దలు అందరూ సమన్వయంతో కేవలం గెలుపు గుర్రాలను మాత్రమే బరిలోకి దింపడం... టిఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఎంతో సానుకూల ఉండడం... టిఆర్ఎస్ పెద్దలు కూడా ప్రచార రంగంలోకి దిగి... ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయడం. ఇలా ప్రతి ఒక్క ఈ విషయంలో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 

 

 

 కానీ ప్రత్యర్థి పార్టీలకు మాత్రం ఎన్నికల్లో నిలబడేందుకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఒకవేళ నిలబడిన అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలను తట్టుకుని ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేంత వ్యూహం పన్నలేకపోయింది. ఇక  పార్టీ పెద్దలు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు మద్దతు అంతంత మాత్రంగానే ఇచ్చారని టాక్ కూడా వినిపిస్తుంది.దీంతో  అధికార పార్టీ వ్యూహాలను చేయించడంలో ఇతర పార్టీలు విఫలమయ్యాయి. ఇదిలా ఉంటే.. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు మిగిలివున్న టార్గెట్ ఒక్కటే అని ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రి పదవిలో తన రాజకీయ వారసుడు కేటీఆర్ ను  కూర్చోబెట్టి రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం కెసిఆర్ ముందు ఉన్న టార్గెట్ అని టీఆర్ఎస్ లీడర్లు చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: