మూడు రాజధానుల విషయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చంద్రబాబు అనూహ్యరీతిలో గట్టి దెబ్బ కొట్టిన నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి దానికి ప్రతీకారంగా ఏకంగా శాసనమండలినే రద్దు చేయాలన్న యోచనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది రాజకీయ నిపుణులు మాత్రం దీనిని పూర్తిగా తప్పు పడుతున్నారు. వారి బాధ అంతా రాష్ట్రంలో మండలి లేకపోతే అభివృద్ధి ఆగిపోతుంది అని కాదు.... అది చివరికి జగన్ కే చేటు చేస్తుంది అని.

 

వివరాల్లోకి వెళితే మరొక రెండు సంవత్సరాలు ఆగితే ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి లో దాదాపు ఇరవై రెండు స్థానాలు ఖాళీ అయిపోతాయి. అప్పుడు జగన్ తనకు నచ్చిన వారిని మండలి లో ఉంచుతారు. అప్పుడు మెజారిటీ వైసీపీ వారిదే అవుతుంది కాబట్టి వారు ఏమి అనుకుంటే అది రాష్ట్రానికి చేయవచ్చు. అందుకని ప్రతి ఒక్కరూ జగన్ కు రద్దుని వాయిదా చేసుకోమని సలహా ఇస్తున్నారు ఎప్పటికైనా మండలిలో వారి మనుషులు ఉంటే ఒక పార్టీకి మరింత బలం చేకూరి అసలు ఎదురు అనేదే లేకుండా పోతుందని వారి తపన.

 

అయితే జగన్ మాత్రం రెండేళ్లపాటు కాలం వృధా చేసుకుంటే 2024 ఎన్నికలకు సంబంధించి ఇబ్బంది పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో తాను వెనక్కి తగ్గితే కచ్చితంగా రాష్ట్ర ప్రజలపై అతనికున్న నమ్మకం పోతుందని మరియు ఏ.పి ప్రజల్లో అతను ఆషామాషీ రాజకీయ నాయకుడు గానే మిగిలిపోతాడేమో అన్న భయం జగన్ కు పట్టుకుంది. ఎక్కడైనా తను సమయం వెచ్చించి ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని ఎలాగైనా సమర్ధించుకునే నాయకుడికే ప్రజలు ఓటు వేస్తారు అన్నది జగన్ యొక్క వాదన. అయితే మన ఏపీ ముఖ్యమంత్రి యొక్క దారి ఎటు ఉండబోతుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: