ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి చైర్మన్ షరీఫ్ గత కొద్ది రోజులుగా తన ఇన్నేళ్ల పొలిటికల్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా వార్తల్లో నిలిచారు. జగన్ శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించుకున్న వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో అడ్డుకట్టవేసి దానిని సెలెక్ట్ కమిటీకి పంపించిన ఆయన పై కొంత మంది ప్రజలు ప్రశంసలు కురిపిస్తూ ఉండగా రాష్ట్రంలో మిగిలిన వారు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. జనాలు అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి కానీ ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

షరీఫ్ రాజధాని బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపే ముందు తన విచక్షణాధికారం వినియోగించి క్రియను చేస్తున్నాను అని అనడం ఇక్కడ గుర్తించదగ్గ విషయం. అతను తన నిర్ణయాన్ని ప్రకటించే ముందు తనకి రూల్స్ అనుమతించడం లేదని చెప్పి అయినా.... అంటూ రాగాలు తీస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దీనిని బట్టి అసలు షరీఫ్ అజెండా ఏమిటన్నదే ఇప్పటికే అందరికీ అర్థం కావాలి. అంటే అతను శాసన మండలి ప్రారంభం కాకముందే దీనిని సెలెక్ట్ కమిటీకి పంపాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి తీర్మానించుకున్నాడా.. అన్నది ఇక్కడ కొంతమంది ప్రశ్న.

 

ఇకపోతే అతను అన్న విధంగానే విచక్షణాధికారం ఉపయోగించి బిల్లలు పాస్ చేసి ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటుంటే ఇక రూల్స్ మాటేమిటి? ఇంకా చట్టాలు అన్నవి ఎందుకు రూపొందించినట్లు? ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకంలో తలెత్తుతున్న ప్రశ్నలు. అతి దారుణమైన రేపిస్తుల విషయంలోనే మన దేశంలో విచక్షణాధికారనికి ప్రాధాన్యత ఇవ్వకుండా రూల్స్ ప్రకారం వ్యవహరిస్తారు మరి ఇక అసెంబ్లీ మరియు మండలిలో ఇంకెంత కచ్చితంగా ఉండాలి..? మొత్తానికి షరీఫ్ తాను చేసిన పనికి సరైన వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: