ఏపీలో రాజకీయ రచ్చ గా మారిన శాసనమండలి, మండలి సభ్యుల వ్యవహారంలో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తమ పార్టీకి చెందిన సనమండలి సభ్యులు ఎక్కడ చేజారిపోతారో అనే టెన్షన్ టీడీపీ అధినేత చంద్రబాబు లో ఉంది. ఇది ఇలా ఉండగానే ఈ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియక బాబు సతమతం అయిపోతున్నాడు. ఏ పరిస్థితుల్లో చంద్రబాబు కు ఈ విషయంలో భరోసా కల్పించేందుకు బీజేపీ రంగంలోకి దిగిందని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. 


 ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలిని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రద్దు చేస్తారంటూ బలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు అమిత్ షాకు ఫోన్ చేశారని, మండలి రద్దు ప్రతిపాదన కేంద్రం వద్దకు వస్తే దానిని ఎట్టిపరిస్థితుల్లోనూ ముందుకు వెళ్లకుండా ఆపాలని కోరినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, తాను ఒక సంవత్సరం వరకు ఆపుతానంటూ అమిత్ షా బాబు కి భరోసా ఇచ్చినట్టు ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై వైసీపీ స్పందించింది. 


 వైసీపీ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయంపై స్పందించారు. అయితే, అసలు అమిత్ షా ఎందుకు మాట్లాడతారని సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ నాయకులను ఎద్దేవా చేశారు. శాసనమండలిలో ప్రస్తుతం తెలుగుదేశం బలం ఎక్కువగా ఉంది. ఇప్పటికే టీడీపీ నాలుగు బిల్లులను పెండింగ్ లో పెట్టి వైసీపీకి షాక్ ఇచ్చింది. ఇంగ్లీష్ మీడియం బిల్లుతో పాటు, మరో బిల్లును శాసనమండలి ఓడించింది. దీంతో మరోసారి శాసనసభలో ఆ రెండు బిల్లులను ప్రవేశపెట్టి వాటిని గట్టెక్కించింది జగన్ ప్రభుత్వం. ఇక మూడు రాజధానులకు సంబంధించిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపడంతో కౌన్సిల్ రద్దు చెయ్యడం తప్పదని అంతా భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: