ఆంధ్ర రాజకీయాలు ఒక ఎఫెక్ట్ అని ఏముంది? ఎప్పుడు చూడు.. పుండు మీద కారం చల్లినట్టు వేడి వేడిగానే ఉంటాయి. ఈ ఏపీ రాజకీయాలు. ఈ వేడి వేడి రాజకీయాల గురించి ఎంత మాట్లాడిన తక్కువే.. చంద్రబాబు నాయుడుకి 2019 ఎన్నికల్లో ఘోరంగా అవమానం జరిగింది. తన రాజకీయ అనుభవం అంత వయసు ఉన్న కుర్రాడు అతన్ని ఘోరాతి ఘోరంగా ఓడించాడు.. 

 

దీంతో చంద్రబాబు నాయుడు బహ ఫీల్ అయిపోయాడు.. ఇంకా ఆ ఫీల్ కి అర్థమే రాష్ట్రంలో జరుగుతున్న గందరగోళానికి కారణం. ప్రభుత్వం ఎంత మంచి పని చేసిన అందులో వివాదం తీస్తాడు.. విమర్శిస్తాడు.. ఆపడానికి ప్రయత్నిస్తాడు.. కుదరలేదు అంటే.. మాత రాజకీయాలు.. ప్రాంత రాజకీయాలు చేస్తాడు.. 

 

ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టడానికి ప్రయత్నిస్తాడు.. మళ్ళి గోల గోల చేస్తాడు.. పెయిడ్ ఆర్టిస్టులతో ఆంధ్ర రాష్ట్రాన్ని హాట్ హాట్ గా మారుస్తాడు.. అదేం అంటే నన్ను ఓడించి వాడిని రాజు చేశారు.. ఏమైనా ఉపయోగం ఉందా అని ప్రశ్నలు వేస్తాడు.. ఇప్పుడు మూడు రాజధానుల గొలను పెంచేశాడు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

 

అయితే ఈ నేపథ్యంలోనే మండలిలో ప్రభుత్వాన్ని తొక్కేయాలి అని అనుకున్నారు బాబోరు.. ఇంకా అంతే.. మండలినే రద్దు చేశారు వైఎస్ జగన్. దీంతో నిరుద్యోగం ఎక్కువ అయ్యింది. కానీ యువతలో కాదు.. రాజకీయాలలో నిరుద్యోగం ఎక్కువ అయ్యింది. ఇప్పుడు సమస్య వచ్చింది ఏంటి అంటే? 

 

ఈ మండలి ఎఫెక్ట్ ఏపీ రాజీకీయాలపై ఏమాత్రం పడుతుంది.. మండలిలో అయితే వైసీపీకి సంబంధించి చాలా తక్కువమంది ఉన్నారు.. మిగితా అందరూ కూడా ఎక్కువ శాతం టీడీపీ వారే ఉన్నారు. వారిలో కూడా ఒకరు ఇద్దరు మొన్న ఈ మధ్యే వైఎస్ జగన్ ను కలిశారు. ఇంకా మిగితావారి పరిస్థితి ఏమి? ఈ మండలి రద్దు ఏపీ రాజకీయంపై ఏమేరకు ప్రభావం చూపనుంది.. అసలు చంద్రబాబు పరిస్థితి ఏంటి ఇప్పుడు? చంద్రబాబు మళ్ళి ఎం చెయ్యనున్నారు? అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: