ఎట్టకేలకు శాసనమండలి రద్దుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపేసింది. ఇక ఈ మండలి రద్దు అంశం ఇప్పుడు కేంద్రం కోర్టులోకి వెళ్లింది. కేంద్రం ఈ బిల్లుని పరిశీలించి... లోక్ సభ, రాజ్యసభల్లో ప్రవేశ పెట్టాలి, తర్వాత దీనిపై చర్చ జరగాలి. నెక్స్ట్ రెండు సభల్లోనూ సాధారణ మెజారిటీతో బిల్లుకు ఆమోదం పడాలి. ఉభయసభల్లో పాస్ అయ్యాక, అబిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడాలి. అలా ఆమోదముద్ర పడిన బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చి..మండలిని అధికారికంగా రద్దు చేస్తుంది. ఇక అప్పటివరకు మండలి పనిచేస్తూనే ఉంటుంది.

 

అంతా సజావుగా సాగితే ఈ ప్రక్రియ ముగిసే సరికి ఏడాది పైనే పడుతుందని, లేదా అంతకంటే ఎక్కువ సమయమే పట్టే అవకాశముందని రాజకీయ విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో మండలిలో మూడు రాజధానుల బిల్లులని అడ్డుకుని, మండలి రద్దుకు కారణమైన టీడీపీ ఇంకా ఎక్కువే సమయం పడుతుందని వాదిస్తుంది.  అయితే ఈ వాదనలని పక్కనబెట్టేస్తే..కేంద్రంతో అంతా సానుకూలంగా ఉంటే ఏడాది లోపే ఈ ప్రక్రియ కంప్లీట్ అయిపోయే అవకాశముంది.

 

కాకపోతే వైసీపీ..కేంద్రంతో ఎంత సఖ్యతతో మెలుగుతుందో దాని బట్టి బిల్లుకు ఆమోదం పడుతుంది. అయితే ఇదే కాకుండా బిల్లుని ఆమోదించుకోవడానికి జగన్ దగ్గర ఓ అస్త్రం ఉంది. అది ఏంటంటే లోక్ సభలో బలమైన మెజారిటీతో ఉన్న బీజేపీకి రాజ్యసభలో బలం లేదు. అక్కడ కాంగ్రెస్ సహ మిగిలిన విపక్షాలకు బీజేపీ కంటే ఎక్కువే బలం ఉంది. అందువల్లే లోక్ సభలో ఆమోదం పొందిన బిల్లులు కొన్ని రాజ్యసభలో బ్రేక్ పడుతుంది. అలా బ్రేక్ పడకుండా ఉండేడుకు అమిత్ షా కొన్ని ప్రాంతీయ పార్టీలు మద్ధతు కోరుతారు. ఇటీవల పౌరసత్వ బిల్లు  సమయంలో కూడా టి‌ఆర్‌ఎస్, టి‌డి‌పి, వైసీపీల మద్ధతు తీసుకున్నారు.

 

ఇక రానున్న రోజుల్లో రాజ్యసభలో బీజేపీ బలం మరింత తగ్గనుంది. ఇదే సమయంలో వైసీపీ బలం పెరుగుతుంది. ఇప్పుడు వైసీపీకి 2 సభ్యులు ఉన్నారు. త్వరలో మరో నలుగురు వైసీపీకి యాడ్ అవుతారు. దీంతో వైసీపీ బలం ఆరుకు పెరుగుతుంది. కాబట్టి వైసీపీ మద్ధతు బీజేపీకి ఖచ్చితంగా కావాలి. అయితే ఇదే అంశంతో కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ...జగన్ మండలి రద్దు బిల్లుని కూడా త్వరగా ఆమోదించుకునే అవకాశముంది. బీజేపీ కూడా దీనికి అడ్డు చెప్పే పరిస్తితి కూడా ఉండదనే చెప్పొచ్చు. మరి చూడాలి జగన్ ఆరో అస్త్రం ఏవిధంగా వర్కౌట్ అవుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: