తొందరలో రద్దయ్యే  శాసనమండలికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయంగా మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.  రద్దవ్వబోయే మండలి వైసిపికి తొమ్మిదిమంది ఎంఎల్సీలున్నారు. ఇందులో మంత్రులు  కూడా ఉన్నారు.  వీళ్ళిద్దరూ జగన్ కు అత్యంత సన్నిహితులు అన్న విషయం అందరికీ తెలిసిందే. సరే మొత్తం మీద జగన్ మాట మీద తొమ్మిది మంతి కూడా తమ సభ్యత్వాలు వదులుకోవటానికి మానసికంగా సిద్ధమైపోయారు. కాబట్టి వీళ్ళందరికీ ప్రత్యామ్నాయం చూపటంలో జగన్ పెద్ద ప్లాన్ వేశారు.

 

రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించటానికి జగన్ రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రసమగ్రాభివృద్ధికి ప్రణాళికలు వేస్తున్నారు. జగన్ ప్లాన్ వర్కవుటైతే  తొందరలోనే మూడు కానీ ఐదు కానీ జోన్లను అమల్లోకి తేవాలని అనుకుంటున్నారు.  ఈ జోన్ల ఏర్పాటు గనుక అమల్లోకి వస్తే ఎంఎల్ఏలకు, సీనియర్ నేతలకు అందులో స్ధానం కల్పించాలని డిసైడ్ అయ్యారని సమాచారం.

 

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తొందరలో ఏర్పాటయ్యే ప్రతి జోన్ లోను సుమారు తొమ్మిది మంది సభ్యులుంటారు. ప్రతి జోన్ కు ముఖ్యమంత్రే కామన్ గా ఛైర్మన్ గా ఉంటారు. అలాగే ప్రతి జోన్ కు ఓ వైస్ ఛైర్మన్ ఉంటారు. ఎంపి, ఇద్దరు ఎంఎల్ఏలతో పాటు నలుగురు సభ్యులుంటారని సమాచారం. వైస్ ఛైర్మన్ కు క్యాబినెట్ ర్యాంకు ఉంటుంది. ఎంపి, ఎంఎల్ఏలకు ఎలాగూ ప్రోటోకల్ ఉంటుంది. కాబట్టి సభ్యుల విషయమే తేలాల్సుంది. అయితే సభ్యులకు కూడా ఎంఎల్ఏల హోదా కల్పిస్తే  వీళ్ళందరికీ అదే  ప్రోటోకాల్ వర్తిస్తుందని అనుకుంటున్నారట.

 

అంటే తొందరలో సభ్యత్వాలు కోల్పోయే తొమ్మిదికి ప్రత్యామ్నాయాలు చూపే విషయంలో జగన్ క్లారిటితోనే  ఉన్నట్లు అర్ధమవుతోంది. అంటే ముందుగా వాళ్ళందరికీ ప్రత్యామ్నాయం చూసుకున్న తర్వాతే మండలి రద్దుకు గట్టి నిర్ణయం తీసుకున్నట్లు  కనిపిస్తోంది.  వైస్ ఛైర్మన్లుగా నియమితులయ్యే వారిలో మండలి సభ్యులుగా మంత్రివర్గంలో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణకు రెండు పదవులు ఖాయమట. మరి మిగిలిన రెండు వైస్ ఛైర్మన్లు కూడా మిగిలిన ఏడుగురు సభ్యులకే దక్కుతుంది. మరి సభ్యులుగా ఎవరెవరికి అవకాశాలు దక్కుతాయో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: