చంద్రబాబునాయుడు మాటలు విన్న తర్వాత అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. శాసనమండలి రద్దు తీర్మానం తర్వాత చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అయితే చంద్రబాబు మాట్లాడే తీరు చూస్తుంటే ఒకదానితో మరొకటి పొంతన లేక పోవటం స్పష్టంగా కనిపిస్తోంది. మండలి రద్దు వల్ల తమకు వచ్చే నష్టం ఏమి లేదని నష్టమంతా జగన్మోహన్ రెడ్డికే అని టిడిఎల్పిలో వ్యాఖ్యానించారు.

 

మండలి రద్దు వల్ల జగన్ కే నష్టమని వ్యాఖ్యానిస్తునే  మండలి రద్దు తీర్మానాన్ని అడ్డుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో ఫోన్లో  మాట్లాడినట్లు ఎల్లోమీడియాలో ప్రచారం చేయించుకున్నారు. మండలి రద్దుతో జగన్ కే నష్టమైతే  మరి అమిత్ షా తో మాట్లాడినట్లు ప్రచారం చేయించుకోవటం ఎందుకు ?  మండలి రద్దు విషయంలో జగన్ వైఖరికి నిరసనగా ఢిల్లీలో భారీ ధర్నాకు ప్లాన్ చేస్తున్నట్లు లీకులిప్పించుకుంటున్నారు.

 

మండలి రద్దు వల్ల టిడిపికి ఎటువంటి నష్టం లేకపోతే  ఢిల్లీలో  ధర్నా చేయబోతున్నట్లు లీకులెందుకు ? అసలు ఏపి విషయానికి సంబంధించి చేస్తే జగన్ ఇంటి ముందో లేకపోతే సచివాలయం ముందో ధర్నా చేయాలి. అంతేకానీ ఏ విధమైన సంబంధం లేని ఢిల్లీలో ధర్నా చేస్తే ఏమొస్తుంది ?  మోడికి వ్యతిరేకంగా అధికారంలో ఉన్నపుడు ఢిల్లీలో నిరసన తెలిపారు. ఏమైనా ఉపయోగం కనబడిందా ? కోట్ల రూపాయల ఖర్చు తప్ప.

 

మండలి రద్దు వల్ల జగన్ కు ఎలాంటి నష్టమయ్యా అంటే కౌన్సిల్లో  సభ్యత్వం ఇస్తానని వందమందికి జగన్ హామీ ఇచ్చారట. ఇపుడా హామీని సిఎం ఎలా నెరవేరుస్తారంటూ చంద్రబాబు పెద్ద లాజిక్ లేవదీశారు. నిజానికి కౌన్సిల్లో ఉన్నదే 58 స్ధానాలైతే వందమందికి జగన్ ఎలా హామీ ఇస్తారు ? జగన్ ఏమైనా చంద్రబాబు లాంటి వాడా ? కనిపించిన ప్రతి ఒక్కళ్ళకు నోటికొచ్చినట్లు హామీలివ్వటానికి. ఇప్పటి వరకు జగన్ వ్యవహారం చూస్తే ఎవరికైనా ఏదైనా హామీ ఇచ్చేముందే జాగ్రత్తగా ఆలోచిస్తారు. అన్నీ విషయాలు తెలిసే చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారంటే మైండ్ బ్లాంక్ అయ్యిందనే అనుమానం పెరిగిపోతోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: