వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో షాకింగ్ ట్విస్టు చోటు చేసుకుంది. తన తండ్రి హత్య కేసు విచారణను సిబిఐకి అప్పగించాలంటూ వివేకా కుమార్తె సునీత నేడు హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే గతంలోనే ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ సీఎం జగన్, వివేకా భార్య, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ వేశారు. 

                          

అయితే ఇప్పుడు తాజాగా వివేకా కుమార్తె సునీత కూడా పిటిషన్ వెయ్యడం చాలా ఆశ్చర్యకరంగా మారింది. కాగా వివేకా హత్య కేసు విచారణ ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నందు వల్ల సీబిఐ విచారణ అవసరం లేదు అని ప్రభుత్వం ఇప్పటికే తేల్చేసింది. అయితే ఇప్పటి వరుకు వచ్చిన పిటిషన్ల అన్నింటిపైనా హైకోర్టు విచారణ జరపనుంది. 

                    

మరి ఈ విచారణలో ఎం జరగనుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది. కాగా.. గత ప్రభుత్వం వివేకా హత్య సిబిఐ కి అప్పగించేందుకు వెనకడుగు వేసింది.. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నందున.. ఒక సంచలనంగా మారింది. అంతేకాదు.. ఈ హత్యపై చందబ్రాబు నాయుడు ఎన్నో విమర్శలు చేశాడు కానీ సిబిఐకి మాత్రం అప్పగించలేదు. 

 

కాగా... వివేకా హత్య కేసులో ఎన్నో ట్విస్టులు ఎదురయ్యాయి.. ఇప్పటికి ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు.. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేసింది.. ఆతర్వాత ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరో సిట్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ సిట్ బృందం కూడా టీడీపీ, వైసీపీకి చెందిన నేతలను విచారించింది. అయినప్పటికీ ఇంతవరుకు ఎటువంటి విషయం బయటపడలేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: