అమ్మఒడి’ విరాళానికి విధి విధానాలు వచ్చాయి. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బ్యాంకు ఖాతా తెరవనున్న సీఎం వై ఎస్ జగన్ ప్రభుత్వం. దానికే జమ చేయాలని హెచ్‌ఎంలకు ఎపి సర్కార్ స్పష్టమైన ఆదేశాలు. ‘అమ్మఒడి’ పథకం సాయం నుంచి పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు విద్యార్థులు ఇచ్చే రూ. వెయ్యి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక బ్యాంకుఖాతా తెరిచి అందులో జమచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ సాయాన్ని నేరుగా స్వీకరించరాదని ఉపాధ్యాయులకు సూచించింది. బ్యాంకుఖాతాలో జమచేయటం ద్వారా పారదర్శకతను పాటించినట్లు అవుతుందని, ఆపై నిధులు పక్కదారి పట్టడానికి ఆస్కారం ఉండదని భావించి పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 41,46,844 మంది విద్యార్థులు తల్లులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు.

జగనన్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల సంఖ్య తుది జాబితా ఖరారైంది. జనవరి 9 నుంచి వీరి బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి ఇంటర్​ వరకూ చదివే విద్యార్థులు 81.7 లక్షల మంది ఉండగా అందులో 65.1 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. విద్యార్థుల వివరాలను తల్లుల ఆధార్​, రేషన్​ కార్డులతో అనుసంధానం చేసి 41.46 లక్షల మంది లబ్ధిదారులతో తుది జాబితా రూపొందించారు. బ్యాంకు ఖాతాల్లో పేర్లు తప్పుగా ఉండడం వల్ల 1.84 లక్షల మంది అనర్హులయ్యారు.

14.7 లక్షల మందిని వివిధ కారణాలతో అనర్హులుగా గుర్తించారు. ఇందులో ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్లు ఉండడం, తల్లి, విద్యార్థుల ఆధార్​ తప్పుగా ఉండడం, సర్కారు నిర్ణయించినదానికన్నా ఎక్కువ స్థిరాస్తి ఉండడం, పథకం వద్దని చెప్పిన వారూ ఉన్నారు. సాయాన్ని ఎలా స్వీకరించాలి, స్వీకరించిన మొత్తాన్ని ఎలా వినియోగించాలి వంటి విధా విధానాలు ఖరారు చేస్తూ ఒక ఉత్తర్వు జారీ చేశారు. ఆర్థిక సాయం పొందిన తల్లులు తమకు అందిన మొత్తం నుంచి తమ వంతు విరాళంగా రూ.1000 పాఠశాల తల్లిదండ్రుల కమిటీకి అందజేయాలని సూచించారు.

దీనిపై తల్లులకు అవగాహన కల్పించేందు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈనెల 30న తల్లిదండ్రుల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, గదుల శుభ్రత కోసం ఈ సాయాన్ని వెచ్చించటానికి వీలుగా తల్లిదండ్రులను చైతన్యపరిచి ఆమేరకు సాయాన్ని సేకరించే బాధ్యతను పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అప్పగించింది. పాఠశాలల్లోని తరగతి గదులు, మరుగొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు ఒక ఆయాను నియమించుకోవటానికి తల్లిదండ్రుల కమిటీకి అధికారo.

మరింత సమాచారం తెలుసుకోండి: