గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి మరియు సీనియర్ రాజకీయవేత్తఅత్యంత చరిష్మా కలిగిన నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేసింది. జగన్ పై కోడి కత్తి దాడి జరిగిన కొద్ది రోజులకి ఇది జరగడం గమనార్హం. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఒకరిపై ఒకరు హత్య కేసు పై ఆరోపణలు చేసుకున్నారు. కాలం గడిచిపోయింది.... జగన్ సీఎం అయ్యాడు కానీ వివేకానందను చంపిన వారు ఎవరో ఇప్పటికీ తెలియలేదు.

 

ఇక కేసు విచారణకు సంబంధించి మొదటి నుంచి అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సి బి ఎంక్వయిరీ కి ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. దానికి బాబు భయపడుతున్నాడు అని అంతా అన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి, షర్మిల మరియు అతని కుటుంబ సభ్యులతో పాటు వివేకా కూతురు సునీత అందరూ కలిసి సిబిఐ ఎంక్వయిరీ కి అనుమతి ఇవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా అది జరగకపోవడం గమనార్హం.

 

అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చింది వెంటనే జగన్ ఎంక్వయిరీ కి ఆర్డర్ వేశాడు. సిట్ విభాగం వారు పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను, ఇంకా వివేక అనుచరులను విచారించి.. కొంతమందిపై ఒక కన్నేసి కూడా ఉంచారు. ఇలా ఎన్ని చేసినా కూడా చివరికి ఎటువంటి ఫలితాలు రాకపోవడంతో విసిగిపోయిన వివేకా కుటుంబ సభ్యులు ఏకంగా జగన్ పైనే ఇప్పుడు పిటిషన్ వేసేందుకు కోర్టు మెట్లు ఎక్కారు. జగన్ ప్రభుత్వం దీనిపై సరిగ్గా దృష్టి పెట్టట్లేదంటూ వారిని ఆరోపిస్తూ ఇప్పుడు వివేకానంద కుటుంబ సభ్యులు తమకు సీబీఐ ఎంక్వైరీ కావాలని కోర్టు వారిని కోరారు.

 

అంతే ఇప్పుడు కేసులో జగన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదా? లేదా చివరికి రాష్ట్ర రాజకీయాలను కుదిపేసే ఏదైనా ఒక ట్విస్ట్ ఉండబోతోందా?  తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వయిరీ కి కోరిన జగన్ తను అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని వెంటనే ఎందుకు అమలు పరచలేకపోయాడు? ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో ఉద్భవిస్తున్న కొత్త ప్రశ్నలు.

మరింత సమాచారం తెలుసుకోండి: