కొన్ని కొన్ని సంఘ‌ట‌న‌లు చూస్తుంటే మ‌నిషనేవాడు ఏమ‌వుతున్నాడు అనిపిస్తుంది. మాన‌వ‌త్వం మంట గ‌లుపుతూ మాన‌వుడు మృగంలా మారుతున్నాడు. బంధాలు అనుబంధాలకు విలువ లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు కొంత మంది మాన‌వ మృగాలు. క‌న్న‌బిడ్డ‌ను నిలువ నీడ‌లా కాపాడుకోవ‌ల‌సిన తండ్రే మృగంలా మారి కాటేయాల‌నుకుంటున్న సంఘ‌ట‌న‌లు ప్ర‌స్తుత స‌మాజంలో ఎన్నో జ‌రుగుతున్నాయి. ఒక్కోసారి ఆలోచిస్తుంటే అస‌లు స‌మాజం ఎక్క‌డికి పోతుంది. ఏం జ‌రుగుతుంది అన్న‌ది అర్ధం కావ‌డం లేదు. కన్న‌తండ్రే బిడ్డ‌ను చెర‌పాల‌ని చూస్తే ఈ స‌మాజంలో ఇంక ఆ ఆడ‌పిల్ల ఎవ‌రిని న‌మ్ముతుంది. ఎక్క‌డికి వెళుతుంది. ఇలాంటి ఘోర‌మైన ఘ‌ట‌నే ఒక‌టి చెన్నై స‌మీపంలోని ఆవ‌డి ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది.

 

 ఓ కామాంధుడు క‌న్న‌బిడ్డ పైన క‌న్నేసి విచ‌క్ష‌ణ కోల్పోయి ప్ర‌వ‌ర్తిస్తున్న వైనం ఈ ఘ‌ట‌న గురించి వెన్న‌వీరంద‌రి మ‌న‌సును క‌లిచివేస్తుంది. కన్న కూతురితో లైంగిక సంబంధం పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న ఓ మూఢనమ్మకంతో ఆ వ్య‌క్తి పైశాచానికి పాల్పడ్డాడు. కూతురు ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో త‌న కోరిక తీర్చాలంటూ బాలికను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు.  ఆవడి పట్టణానికి చెందిన అరుళ్ అనే న‌ల‌భై ఏళ్ళ వ్య‌క్తి త‌న ప‌ద‌హారేళ్ళ త‌న కుమార్తెను త‌న కోరిక తీర్చ‌మంటూ టార్చ‌ర్ పెట్ట‌డం జ‌రిగింది. ఆ బాధ‌ల‌ను భ‌రించ‌లేక బాలిక స్థానిక పోలీసుల‌ను ఆశ్ర‌యించింది.  ఈ నెల 24వ తేదీన ఆ బాలిక పోలీసులకు ఫోన్ చేసి తండ్రి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన మాట ప్ర‌కారం ఆ ఇంటి అడ్రస్‌కు వెళ్లిన పోలీసులు విచారించగా అరుళ్ పదేళ్లుగా అదే ఇంట్లో ఉంటున్నట్లు చుట్టపక్కల వాళ్లు చెప్పారు. 

 

ఆరు నెలలకు ఓ సారి నామక్కల్‌ జిల్లా కొల్లిమలైకి వెళ్లి ధ్యానం చేస్తుంటాడని చెప్పారు. అయితే పోలీసులు వెళ్లిన సమయంలో అరుళ్ ఇంట్లో లేడు. దీంతో కుటుంబ సభ్యులతో అతడికి ఫోన్ చేయించి ఇంటికి రప్పించి పోలీసులు విచార‌ణ  చేశారు. దాంతో అత‌డు నిజ నిజాల‌ను అంగీక‌రించాడు. లైంగికంగా త‌న బిడ్డ‌ను వేధించిన‌ట్టు ఒప్పుకున్నాడు. క‌న్న‌బిడ్డ‌తో లైంగిక సంబంధం పెట్టుకుంటే త‌న ఆయుష్షు పెరుగుతుంద‌ని ఎవ‌రో స్వామీజీ చెప్ప‌గా తాను అందుకే అలా ప్ర‌వ‌ర్తించాన‌ని చెప్ప‌సాగాడు. దీంతో పోలీసులు  అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మూఢనమ్మకంతో కూతురి జీవితాన్ని నాశనం చేసేందుకు ప్ర‌య‌త్నించిన ఆత‌ని పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు మండిప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: