హైద‌రాబాద్‌లో ప‌లు హాస్ట‌ల్లో ఉంటున్న అమ్మాయిలు, మ‌హిళ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇటీవ‌ల కాలంలో న‌గ‌రంలో దిశ వంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్న నేప‌ధ్యంలో అమ్మాయిలు సెల్ఫ్‌డిఫెన్స్ చేసుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. బ‌స్టాపుల్లో బ‌స్సుల్లో మెట్రోట్రైనుల్లో ప్ర‌యాణం చేసేట‌ప్పుడు ఆక‌తాయిలు ఏదో విధంగా ప‌రిచ‌యం చేసుకుని ప్రేమ పెళ్ళి అంటూ త‌మ ప‌ర్స‌న‌ల్ కాంటాక్ట్‌ల‌ను తీసుకుని వేధింపుల‌కు పాల్ప‌డుతున్నారు.

 

ఇలాంటి సంద‌ర్భాల్లో మ‌న‌కు తెలియ‌ని వ్య‌క్తుల‌కు మ‌న ప‌ర్స‌న‌ల్ స‌మాచారాన్ని అందించ‌డం శ్రేయ‌స్క‌రం కాదు. వీటివ‌ల్ల అనేక ఇబ్బందుల‌కు గురి కావ‌ల్సి ఉంటుంది. అందులోనూ కుటుంబ స‌భ్యుల‌తో కాకుండా ఒంట‌రిగా హాస్ట‌ళ్ళ‌ల్లలో ఉండే ఆడ‌వారు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఆక‌తాయిల‌కు ఎక్కువ‌గా ఒంట‌రిగా ఉన్న ఆడ‌వాళ్ళ‌ను ఎక్కువ‌గా టార్కెట్ చేసి అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్నారు. ఉద్యోగ‌రిత్యా, చ‌దువురీత్యా ఆడ‌పిల్ల‌లు ఎక్క‌డెక్క‌డి నుంచో వ‌ల‌స వ‌చ్చి ఉండేవారు మ‌రింత జాగ్ర‌త్త‌లు వ‌హిస్తేనేగాని నేటి స‌మాజంలో బ్ర‌త‌క‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. 

 

ఇటీవ‌లె హైద‌రాబాద్‌లో  ఓ  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోన్న ఓ అమ్మాయికి వేధింపులు ఎదురవుతున్నాయి.  దీంతో  ఆమె పోలీసుల ఆశ్ర‌యించింది. ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఓ సంస్థలో ఉద్యోగం చేసుకునే ఆమెను రోజూ శ‌శాంక్ అనే యువ‌కుడు వేధింపుల‌కు గురి చేస్తున్న‌ట్లు తెలిపింది. అతడి వేధింపులు తాళలేక చివరకు ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకోవాలని కొంత కాలంగా అతడు వేధిస్తున్నాడని తెలిపింది. తాను వరంగల్ నుంచి వచ్చి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్నానని ఈ క్రమంలో తనకు వేధింపులు ఎదురవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్య‌ప్తు మొద‌లు పెట్టారు. ఇలాంటి ప‌రిస్థితులు ఎన్నో రోజూ హైద‌రాబాద్‌లో జ‌రుగుతూనే ఉన్నాయి. కాబ‌ట్టి ఎప్పుడూ పోలీసుల ఫోన్ నెం. షీటీమ్స‌కి సంబంధించిన వ‌న్నీ వాళ్ళ ద‌గ్గ‌ర ఉండాలి.  ఏమాత్రం మ‌నం అజాగ్ర‌త్త‌గా ఉన్నా కూడా  ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్ర‌మాదం కూడా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: