నార్నే శ్రీనివాసరావు...తెలుగు అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్‌కు పిల్లనిచ్చిన మామ. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా దగ్గర బంధువే. అటు నందమూరి కుటుంబానికి, ఇటు చంద్రబాబుకు బంధువైన నార్నే, 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం సైలెంట్‌గా ఉన్న నార్నే, హఠాత్తుగా వైసీపీలోకి వచ్చి పడ్డారు. ఇక అప్పుడు నార్నే వైసీపీలో చేరడం వెనుక ఎన్టీఆర్ కూడా ఉన్నాడని ప్రచారం కూడా జరిగింది.

 

అయితే ఆ ప్రచారాన్ని ఖండిస్తూనే, నార్నే చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసి పెద్ద సెన్సేషనే క్రియేట్ చేశారు. ఇక ఈయనకు వైసీపీ నుంచి గుంటూరు ఎంపీ లేదా, చిలకలూరిపేట అసెంబ్లీ టికెట్ వస్తుందని ప్రచారం జరిగింది. కానీ అప్పటికే అభ్యర్ధులు ఫిక్స్ అయిపోవడంతో నార్నేకి ఎన్నికల బరిలో దిగే అవకాశం రాలేదు. దీంతో ఆయన జగన్ సీఎం అయితేనే రాష్ట్ర బాగుపడుతుంది, చంద్రబాబుని నమ్మి మోసపోవద్దని ఎన్నికల్లో ప్రచారం చేశారు. అనుకున్నట్లుగానే ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో గెలిచేసింది. జగన్ సీఎం అయిపోయారు. కానీ నార్నే మాత్రం పార్టీలో కనిపించడం లేదు. జగన్ గెలిచిన దగ్గర నుంచి నార్నే పార్టీ ఆఫీసులో గానీ, ఏదైనా సభలో గానీ కనపడలేదు.

 

పైగా నార్నే ఏదైనా పదవి ఆశిస్తున్నట్లు మీడియాలో కూడా వార్తలు వచ్చినట్లు లేవు. అలాగే ఆయనకు జగన్ ఎలాంటి కీలక పదవి కూడా ఇవ్వలేదు. అయితే ఇప్పటికే వైసీపీలో పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. పైగా మండలి కూడా రద్దు చేయడంతో ఆశావాహుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో నార్నేకి ఫీచర్‌లో పదవి ఇవ్వడం అనేది కొంచెం కష్టమే. అయితే నార్నే బిజినెస్‌మెన్ కాబట్టి, ఏవైనా కాంట్రాక్టులు దక్కించుకునే అవకాశముంది. మరి చూడాలి రానున్న రోజుల్లో నార్నేకి ఏదైనా పదవి వస్తుందో? లేదో? 

మరింత సమాచారం తెలుసుకోండి: