మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐ కి అప్పగించాలంటూ ఆయన కూతురు సునీత తాజాగా దాఖలు చేసిన పిటిషన్,  వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది .  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వం లో రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుండగా , ఆయన సోదరి తన తండ్రి హత్య కేసు నిగ్గు తేల్చే బాధ్యతలను సిబిఐ కి అప్పగించాలని కోరడం హాట్ టాఫిక్ గా మారింది . దానికితోడు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు సిబిఐ కి ఇచ్చేందుకు పెద్దగా ఆసక్తి ప్రదర్శించడం లేదు . దీనితో ప్రతి ఒక్కరిలోను వివేకా హత్య కేసులో నిగ్గు తేలాల్సిన నిజాలు వెలుగులోకి రాకుండా పోతాయా ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి  .

 

 గత ఏడాది సార్వత్రిక , అసెంబ్లీ  ఎన్నికల సమయం లో వివేకా హత్య జరగడం , రాష్ట్రం లో అధికారం లో ఉన్న టీడీపీ నేతలే ఈ హత్య చేసి ఉంటారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి . వైఎస్ కుటుంబం కూడా ఇవేరకమైన ఆరోపణలు చేసింది . రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే స్పందించి  ప్రత్యేక పోలీసు దర్యాప్తు  బృందం (సిట్ ) ఏర్పాటు చేసింది . కేసు ఒక కొలిక్కి రాకముందే రాష్ట్రం లో అధికార మార్పిడి జరిగింది . ఎన్నికల్లో ఘనవిజయం సాధించి,  అధికారం లోకి వచ్చిన  జగన్ సర్కార్ ,   వివేకా హత్య నిగ్గు తేల్చేందుకు మరొక  సిట్  ఏర్పాటు చేసింది  . సిట్ తన దర్యాప్తు లో ఇప్పటికే పలువురు టీడీపీ , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను విచారించింది .

 

 సిట్ దర్యాప్తు పై నమ్మకం లేని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి , బీజేపీ నేత , మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి లు వివేకా హత్య కేసు విచారణను సిబిఐ కి ఇవ్వాలని హైకోర్టు ను ఆశ్రయించారు .  టీడీపీ ప్రభుత్వ హయాం వివేకా సతీమణి తోపాటు , అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కేసును సిబిఐ కి ఇవ్వాలని కోర్టును కోరారు . ఇప్పుడు వివేకా హత్య కేసును విచారణను  సిబిఐ కి  అప్పగించాలని ఆయన కూతురు కోరడం ఒక ఎత్తయితే ...  రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు అభ్యంతరం  మరొక ఎత్తు . 

మరింత సమాచారం తెలుసుకోండి: