రాజ్యాంగంపట్ల నమ్మకం, గౌరవం, సదభిప్రాయం లేని వ్యక్తి జగన్మోహన్‌రెడ్డని, ఆయనకు ప్రజలమీద గౌరవం, మర్యాద లేవని, టీడీపీనేత, రాజ్యసభసభ్యులు కనకమేడ ల రవీంద్రకుమార్‌ స్పష్టంచేశారు. తనను బాధించిందనే జగన్‌ మండలిని రద్దుచేశాడని, ఆయన గత 7నెలలనుంచీ ప్రజల్ని ఎంతగా బాధించి, వేధించాడో ఎందుకు ఆలోచించ లేకపోతున్నాడన్నారు. 30-05-2019నుంచి మండలి 32 బిల్లులవరకు ఆమోదించిం దని, రెండుబిల్లుల్ని సెలెక్ట్‌కమిటీకి పంపితే ఆ నిర్ణయాన్ని జగన్‌ తప్పుపట్టడం దారుణమన్నారు. 

 

మండలిలో చర్చించిన అంశాలను అసెంబ్లీలో చర్చించడానికి వీల్లేదని, ముఖ్యమంత్రి ఆదేశాలతో స్పీకర్‌ తమ్మినేని విచక్షణ, సభ్యత కోల్పోయి ప్రవర్తించాడన్నారు  మండలిని రద్దుచేయడానికి జగన్‌కు ఏం అధికారాలున్నాయని, రద్దుచేయడానికి అదేమైనా ఆయన కుటుంబసమస్యా అని కనకమేడల ప్రశ్నించారు. రాజకీయపరమైన కుట్రతోనే, బీసీలు అధికంగా ఉన్న మండలిని జగన్‌ రద్దుచేశాడని, తద్వారా ఆయన తాను బీసీల వ్యతిరేకినని చెప్పకనే చెప్పాడన్నారు.  జగన్‌కు అధికారముంటే, తనపై కేసులు పెట్టారని న్యాయవ్యవస్థను కూడా రద్దు చేసి ఉండేవాడన్నారు. మండలిఛైర్మన్‌ తీసుకున్న నిర్ణయం జగన్‌ను బాధించినప్పుడే  ఆయనకు మండలినిర్వహణకు ఖర్చవుతుందన్న విషయం గుర్తొచ్చిందా అని కనకమేడల ప్రశ్నించారు. 


ఆర్టికల్‌ 169 ప్రకారం మండలినిరద్దుచేయడం, పునరుద్ధరించడం అనే నిర్ణయాలపై తీర్మానం చేసే అధికారం మాత్రమే రాష్ట్రప్రభుత్వాలకు ఉంటుందన్నారు. హేతుబద్ధమైన , రాజ్యాంగబద్దమైన కారణాలు లేకుండా మండలిని రద్దుచేస్తే, అది న్యాయసమీక్షలో, శాసనవ్యవస్థలో నిలబడదని కనకమేడల స్పష్టంచేశారు. మండలిరద్దుచేశాను... సభ్యులందరూ ఇంటికెళ్లండని చెబుతున్న జగన్‌, తనకేబినెట్లో ఉన్న ఇద్దరుమంత్రులతో ఎందుకు రాజీనామా చేయించ లేదన్నారు. జగన్‌లా తమనాయకుడు అసెంబ్లీకి రాకుండా వెనకడుగువేయలేదని, రాష్ట్రప్రభుత్వం ఎన్నిరకాలుగా వేధిస్తున్నా, చంద్రబాబు నాయుడు ప్రజలకోసమే అవన్నీ భరిస్తున్నాడన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మండలిని రద్దుచేయడం, పునరుద్ధరించడమనే ప్రక్రియ రాజ్యాంగసంస్థలకు సహేతుకం కాదని, 06-08-2013న రాజస్థాన్‌కౌన్సిల్‌ని రద్దుచేయమని రాజ్యసభకు పంపితే, సభ సదరు బిల్లుని స్టాండింగ్‌కమిటీకి పంపిందన్నారు. 


స్టాండింగ్‌కమిటీ దానిపై సూచనలుచేస్తూ, ఏరాష్ట్రంపడితే, ఆరాష్ట్రం ఇస్టానుసారం రాజ్యాంగసంస్థల్ని తొలగించడం మంచిదికాదని, దీనికి ఒకజాతీయ విధానం ఉండాలని, ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజ్యాంగవ్యవస్థల్ని రద్దుచేస్తామనడం సరికాదని స్పష్టం చేసిందని కనకమేడల వివరిం చారు. అస్సాం, తమిళనాడు కౌన్సిళ్ల విషయంలోకూడా ఇదేపరిస్థితి ఎదురైందన్నారు. రాష్ట్రం మండలిని రద్దుచేస్తూ, తీర్మానం పంపినవెంటనే అంతా అయిపోయినట్లు కాదన్నారు.  రాష్ట్రపతి గెజిట్‌నోటిఫికేషన్‌ వచ్చేవరకు లెజిస్లేటివ్‌కౌన్సిల్‌ యధావిథిగా పనిచేస్తుందని, అప్పటివరకు దానిచర్యలను, ఉనికిని ప్రశ్నించే అధికారం ఎవరికీ ఉండదని కనకమేడల తేల్చిచెప్పారు. 25మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలువంచుతానన్న ముఖ్యమంత్రి, అవసరమైనప్పుడల్లా కేంద్రపెద్దలముందు, కేసీఆర్‌ముందు మెడలు వంచుతూనేఉన్నాడని కనకమేడల ఎద్దేవాచేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: