కొత్త బడ్జెట్.. ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. అయితే అలాంటి ఈ బడ్జెట్ పై ఇప్పటికే ఎన్నో ఊహలు నెలకొన్నాయి. వస్తువులు అన్ని భారీ రేట్లు పెరుగుతాయి అని.. దాదాపు 50 వస్తువులపై ధరలు పెరగనున్నాయి అని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్ధిక మందగమనం కనిపిస్తున్న నేపథ్యంలో తెలుగింటి కోడలు.. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ కు 2020- 2021 బడ్జెట్ పరీక్ష అనేది అగ్ని పరీక్ష అనే చెప్పాలి. 

 

అయితే ఇప్పుడు విడుదల అయ్యే ఈ కొత్త బడ్జెట్ ఎలా ఉంటుంది.. అసలు మధ్య తరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంత వరుకు ఉపయోగకరం.. అసలు ఎలా కరుణించబోతున్నారు ? ఇప్పుడు ఎక్కడ చుసిన ఈ బడ్జెట్ గురించే మాట్లాడుతున్నారు.. అయితే బంగారం ధరలు ఈ సంవత్సరం భారీగా పెరిగాయి ఈ ధరలను ఆమె ఎలా వంచబోతున్నారు? 

 

ఆమెకు అగ్నిపరీక్ష పెట్టబోయే డిమాండ్లు ఇవే... వేతన జీవులు, మధ్యతరగతి వర్గాలపై ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది.. పన్ను రేట్లను తగ్గిస్తే మధ్య తరగతి జీవులకు డబ్బు ఆదా అవుతుంది. కార్పొరేట్‌ ఆదాయ పన్ను రేటు, వ్యక్తిగత ఆదాయ పన్ను రేటు మధ్య వ్యత్యాసాలను తగ్గింది సత్వర చర్యలు అవసరం ఉంది. 

 

పంటలకు మెరుగైన ధర కల్పించాలని, రుణాలు రద్దు చేయాలని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అంతేకాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల ఆదాయాలు కూడా భారీగా తగ్గాయి..  ప్రతి నెలా దాదాపు 12 లక్షలపైనే యువ జనాభా ఉద్యోగాల మార్కెట్లోకి వస్తున్నారు కానీ వారికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కష్టంగా ఉంది. కాబట్టి యువతకు ఉద్యోగా అవకాశాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. మరి నిర్మలమ్మ ఈ అగ్ని పరీక్షలో ఎలా పాస్ అవుతుంది అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: