తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో తయారైన నివేదికపై గుడ్డిగా సంతకా లు చేసిన జీ.ఎన్‌.రావు ఆయన కమిటీలోని సభ్యులు, టీడీపీప్రభుత్వ హయాంలో అంతర్జాతీయంగా పేరుప్రతిష్టలు పొందిన విశాఖ నగరాన్ని ఎందుకూ పనికిరాని నగరంగా తమ నివేదికలో పేర్కొన్నారని టీడీపీనేత, మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వ రరావు మండిపడ్డారు. జీ.ఎన్‌.రావు కమిటీ నివేదికను సాకుగాచూపుతూ, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌కేపిటల్‌ పెడతామని చెబుతున్న జగన్‌ప్రభుత్వం, విశాఖనగరానికి తుపాన్లముప్పు ఎక్కువని, అక్కడ కాలుష్యంఅధికమని, ఆ నగరం నివాసానికి అనుకూల ం కాదని జీ.ఎన్‌.రావుకమిటీ ఇచ్చిన నివేదికపై ఏం సమాధానం చెబుతుందని బొం డా ప్రశ్నించారు. 

 

ప్రభుత్వచర్యలను, జీ.ఎన్‌.రావు నివేదికను చూస్తుంటే, ఆయనిచ్చిన నివేదికకు తలాతోకలేదని, ఆయన తీసేసిన తహసీల్దార్‌లాంటివాడని అర్థమవుతోందన్నా రు. జీ.ఎన్‌.రావు, బోస్టన్‌కమిటీ నివేదికలు అంత విశ్వసనీయత కలిగినవే అయితే, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జగన్‌ప్రభుత్వం ఎందుకు సంకోచిందని ఉమా ప్రశ్నించా రు. జీఎన్‌.రావు కమిటీ నివేదికకు, కమిటీలోని సభ్యులు చెబుతున్న అంశాలకు, బయట మాట్లాడుతున్న తీరుకి ఎక్కడా పొంతనఉండటం లేదన్నారు. గతేడాది అక్టోబర్‌ 13న జీ.ఎన్‌.రావు కమిటీవేస్తే, 6రోజుల్లో 13 జిల్లాలను చుట్టేశారని, అంతిమంగా  వైసీపీతయారు చేసిన దానిపై బృందసభ్యులు సంతకాలు  చేశారన్నారు. 

 

శివరామకృష్ణన్‌ కమిటీ 13జిల్లాల్లో పూర్తిస్థాయిలో పర్యటించి, ఏప్రాంతంలో రాజధాని పెడితే మంచిదనే దానిపై సవివరమైన నివేదికను ఇవ్వడంజరిగిందన్నారు.  అమరావతిపై ఆదినుంచి కక్షతో ఉన్న జగన్మోహన్‌రెడ్డి, ఎవరినీ సంప్రదించకుండా మొక్కుబడిగా కమిటీలువేసి, ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తోందన్నారు. విశాఖనగరాన్ని గడచిన 5ఏళ్లలో అంతర్జాతీయ నగరంగా మార్చడానికి చంద్రబాబు శ్రమించారని, రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ సదస్సు ఏదిజరిగినా అక్కడే నిర్వహించేవారన్నారు. అలానే పదిసార్లు తిరిగి  విశాఖకు లులూగ్రూప్‌ని తీసుకొచ్చారని, 70వేలకోట్ల పెట్టుబడిపెట్టే ఆదానీడేటాసెంటర్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, ఇతర ఫార్మా పరిశ్రమల్ని ఏర్పాటుచేశారని ఉమా పేర్కొన్నారు. సాగరనగరాన్ని హుద్‌హుద్‌ కబళించినప్పుడు, వారంరోజులు అక్కడే ఉండి నగరం బాగుపడేవరకు, అన్నిశాఖల అధికారులతో కలిసి రేయింబవళ్లు పనిచేశారన్నారు.  

 

అలాంటి విశాఖ నగరం నివాసానికి అనుకూలం కాదని, అదికోస్టల్‌జోన్‌ ఏరియాలో ఉందని, అక్కడున్న పోర్టు, ఉక్కుపరిశ్రమ, నేవీజలాంతర్గాముల కారణంగా కాలుష్యం ఎక్కువని, సముద్రజలాలు ముంచుకొస్తున్నకారణంగా తాగునీరు ఉప్పునీటిగా మారుతుందని, జీ.ఎన్‌.రావుకమిటీ తననివేదికలో చెప్పడం జరిగిందని చెప్పడం దుర్మార్గం కాదా అని బొండా నిలదీశారు. ఒకవైపు కమిటీలపేరుతో ఇలాంటి నివేదికలు ఇస్తూ, మరోవైపు ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్‌కేపిటల్‌ పేరుతో ఎందుకు నాటకాలు ఆడుతున్నా రని ఆయన ప్రశ్నించారు. నివేదికలోని తప్పుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, విశాఖలో కాకుండా కాస్తదూరంగా విశాఖమెట్రోపాలిటన్‌ రీజియన్‌దాటి దూరంగా రాజధాని పెట్టవచ్చని సూచిస్తున్నారని, అలాపెట్టేట్టయితే మిలీనియంటవర్స్‌ని ఎందుకు ఎంపిక చేసుకున్నా రని, దీన్నిబట్టే జీ.ఎన్‌.రావుకమిటీకి ఉన్న అవగాహనేమిటో అర్థంచేసుకోవచ్చ న్నారు. అటు విశాఖవాసుల్ని, ఇటురాష్ట్రప్రజల్ని మోసం చేయడానికే ప్రభుత్వం ఇలానాటకాలు ఆడుతోందని, విశాఖపై ఆ విధంగా దుష్ప్రచారంచేస్తే, భవిష్యత్‌లో ఎవరైనా అక్కడ పెట్టుబడులు పెడతారా అని ఉమా వాపోయారు. అమరావతిని చంపేయాలన్న తహతహ తప్ప, రాజధాని తరలింపులో ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధిలేదన్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: