కోర్టు ధిక్కరణ కేసు లో హైకోర్టు ఇద్దరు జిల్లా కలెక్టర్లకు జరిమానా విధించింది। ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. సిద్దిపేట ఆర్డీఓ జయచంద్రా రెడ్డికి రెండు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. బుధవారం ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సిరిసిల్ల జి...సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌కు రూ.2,000 జరిమానా విధించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, విచారణ జరిపి రైతులకు ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు 2018లో తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పునకు విరుద్ధంగా భూ సేకరణ అధికారులు వ్యవహరించారంటూ మల్లన్నసాగర్ బాధిత రైతులు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేశారు. 2019 మే నెలలో హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పాటించకుండా డిక్లరేషన్, అవార్డను ప్రకటించారని మరోసారి కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ రెండు పిటీషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. ఇది సంతకాలు చేయని రైతుల గొప్ప విజయం. 14 మంది మాత్రమే మిగిలారు,

వీళ్లు ఏమీ చేయలేరని అనుకున్నారు. 17000 ఎకరాల భూమి తీసుకున్నాం.. కేవలం 41 ఎకరాల భూమి కోసం వీళ్లు ఏమి చేయగలరని హేళన చేశారు. హైకోర్టు సరైన తీర్పుతో సమాధానం చెప్పింది’ అని ఓ రైతు పేర్కొన్నారు. అన్నీ ఒకేసారి ఇస్తే సంతకాలు చేస్తామని జనవరి 2019లో మేం చెప్పాం. కొందరు తమ ప్రయోజనాల కోసం సంతకాలు చేయించారు. కానీ, ఇప్పటివరకు చాలా మందికి రావాల్సిన పరిహారం ఇవ్వలేదు’ అని మరో రైతు చెప్పారు.

సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి. వెంకట్రామ్ రెడ్డి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కు రూ. 2 వేల చొప్పున జరిమానా విధించింది. నాలుగు వారాల్లో జరిమానా చెల్లించకపోతే ఒకనెల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. వీరిద్దరితో పాటు సిద్దిపేట ఆర్డీఓ జయచంద్రా రెడ్డికి రెండు నెలల జైలు శిక్ష తో పాటు రూ. 2 వేలరూపాయలు  జరిమానా విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: