కరోనా దెబ్బ ఎలా ఉన్నదో ప్రపంచానికి రుచి చూపిస్తోంది.  ఎక్కడ చూసినా దీని గురించే చర్చించుకుంటున్నారు.  కరోనా వైరస్ ప్రపంచంలోని 17 దేశాలకు విస్తరించింది.  చైనాలోని ప్రతి ప్రాంతానికి కూడా ఈ వైరస్ విస్తరించడంతో ప్రజలు భయపడిపోతున్నారు.  కరోనా భయానకంగా మారడంతో ప్రపంచానికి ఎలాంటి ముప్పు తీసుకురాబోతున్నదో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.  


అయితే, కరోనా వైరస్ ను కొంతవరకు అరికట్టేందుకు చైనా కార్పొరేషన్ దిగ్గజాలు ముందుకు వచ్చాయి.  వైరస్ ను అడ్డుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.  ఇందులో భాగంగానే కొన్ని కార్పొరేషన్ కంపెనీలు ముందుకు వచ్చాయి.  అందరు ఒకేచోట చేరి పనులు చేసుకుంటే దానివలన వైరస్ మరింత త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది.  అందుకోసమే ఈ వైరస్ ను నిలువరించేందుకు కొన్ని సన్నాహాలు చేసుకుంది.  


ప్రపంచంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఉన్న పేస్ బుక్ ఇప్పుడు కొత్తగా ఓ ఆలోచన చేసింది.  పని ఆగకూడదు అలానే ఇబ్బందులు పడకూడదు.  అందుకోసమే చైనాలోని తమ ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే సౌకర్యాన్ని కల్పించింది.  ఇంటినుంచి పనిచేయడం వలన వైరస్ ప్రభావం నుంచి కొంతవరకు బయటపడొచ్చు.  అలానే కొంత మెరుగైన ఫలితాలు కూడా సాధించవచ్చు.  


ఇకపోతే, చైనా ఆన్లైన్ మార్కెట్ దిగ్గజం అలీబాబా కూడా ఈ ఫెసిలిటీ కల్పించింది.  చైనా కంపెనీ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.  అటు యాపిల్ సంస్థ చైనాలోని ఓ పెద్ద రిటైల్ స్టోర్ ను తాత్కాలికంగా మూసివేసింది.  దీంతో పాటుగా కొన్ని చోట్ల పనివేళలు బాగా తగ్గించింది.  ఇకపోతే ట్రేసెంట్ సంస్థ ఏకంగా ఉద్యోగులకు సెలవులు ప్రకటించింది.  ఈ విధంగా వైరస్ ను తగ్గించేందుకు కార్పొరేషన్ కంపెనీలు ఇలా పనిచేస్తున్నాయి. మరో పదిరోజుల్లో ఈ వైరస్ కారణంగా వేలాదిమంది మరణించే అవకాశం ఉన్నట్టుగా చైనా ఆరోగ్య సంస్థలు హెచ్చరించడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: