టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ ఛైర్మన్లతో, మేయర్లతో ఈరోజు భేటీ అయ్యారు. కేటీయార్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సెటైర్లు, పంచులు వేశారు. ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నామని కేసీఆర్ గారికి తెలంగాణలో ఏ వాగు ఎక్కడ ఉందో ఏ వంక ఎక్కడ ఉందో ఏ డొంక ఎక్కడ ఉందో, ఏ నది ఎక్కడ ఉందో, ఏ చెరువు ఎక్కడ ఉందో పూర్తిస్థాయిలో అన్నీ తెలుసని కేటీఆర్ అన్నారు. 
 
కేసీఆర్ ఈ నది నుండి, ఈ చెరువు నుండి నీళ్లు ఇస్తామని అసెంబ్లీలో చెప్పే సమయంలో మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయి లేపితే స్పీకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి నిలబడ్డారని ఆ సమయంలో అధికార పార్టీ సభ్యులందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏవైనా మంచి పాయింట్లు చెబుతారని అనుకున్నామని లేదంటే ప్రభుత్వంపై ఏవైనా విమర్శలు చేస్తారేమో అని ఊహించామని కేటీఆర్ చెప్పారు. 
 
ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి ఈ ముఖ్యమంత్రి గారు నీళ్ల మీద మాట్లాడతారని తమకు తెలియదని ప్రిపేరై రాలేదని చెప్పారని  అసెంబ్లీకి ప్రిపేరై రాలేదంటే పరీక్షకు పోయిన పిల్లగాడు పరీక్షకు వచ్చిన తరువాత ఔట్ ఆఫ్ సిలబస్ ప్రశ్నలు ఇచ్చారు... నాకు తెలవదు అంటే ఎట్లుంటదో ఉత్తమ్ కుమార్ రెడ్డి కథ కూడా అదే విధంగా ఉందని కేటీఆర్ అన్నారు. అక్కడ అసెంబ్లీలో ప్రిపేరై రాలేదని అంటారని ఇక్కడ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికలకు తయారుగా లేమని చెబుతారని విమర్శలు చేశారు. 
 
ఏ రాజకీయ పార్టీకైనా ఏ మున్సిపాలిటీలోనైనా అన్ని కులాల నాయకులు ఉంటారని, అన్ని మతాల నాయకులు ఉంటారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం మా పార్టీలో పోటీ ఎక్కువగా ఉందని మేం మొత్తం తయారు చేసుకోవాలి... టైం కావాలి.. అని చెబుతారని కేటీఆర్ అన్నారు. 3,148 వార్డులకు ఎన్నికలు జరిగితే 8,900మంది టీఆర్ ఎస్ తరపున నామినేషన్లు వేశారని అన్నారు. కాంగ్రెస్ లో కూడా పోటీ ఇలానే ఉంటుందేమో అనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వాలన్నా కూడా 800 చోట్ల కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరని బీ ఫాంలు ఇస్తామంటే కూడా తీసుకునే దిక్కు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఉత్తమ్ కుమార్ పై వేసిన సెటైర్లు, పంచులు బాగా పేలాయని నెటిజన్ల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: